News February 21, 2025

మచిలీపట్నం: APK ఫైల్ క్లిక్ చేస్తే.. ఖాతా ఖాళీ.!

image

ఆన్లైన్‌లో అనుమానాస్పద APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ కావొచ్చు అని ఎస్పీ ఆర్. గంగాధరరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అపరిచిత లింకులు, అనధికారిక యాప్‌ల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు. 

Similar News

News November 10, 2025

MTM: నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం కలెక్టరేట్‌లో “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలలో కూడా PGRS జరుగుతుందని ఆయన వెల్లడించారు.

News November 8, 2025

కృష్ణా: ‘బెదిరించి రూ.14 లక్షలు దోచేశారు’

image

59 ఏళ్ల వ్యక్తికి ఫోన్ చేసి తన నంబర్‌పై కేసు నమోదైందని బెదిరించి రూ. 14 లక్షలు దోచుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు విశాఖ CPని ఆశ్రయించారు. కేసు విచారణలో నిందితులు కృష్ణా జిల్లా పెడనకి చెందిన తారకేశ్వర్రావు, శివకృష్ణ, నాగరాజు, చందు, అబ్దుల్ కరీంగా గుర్తించారు. వీరు 350 నకిలీ సిమ్స్‌ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు.