News February 17, 2025

మటన్ షాపులకు ఎగబడ్డ జనం.. విపరీతంగా పెరిగిన రేట్లు!

image

బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ విక్రయాలు అమాంతం పడిపోగా మటన్, రొయ్యలు, చేపల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ప.గో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కేజీ మటన్ గరిష్ఠంగా రూ.1200 వరకు విక్రయించినట్లు తెలుస్తోంది. చేపలు కేజీ సాధారణంగా రూ.130గా ఉంటే రూ.180కి, రొయ్యలు రూ.250గా ఉంటే రూ.350కి పెంచి అమ్మారు. ధర ఎక్కువయినప్పటికీ బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు వీటి కొనుగోళ్లకే మొగ్గు చూపారు. చికెన్ షాపులు వెలవెలబోయాయి.

Similar News

News February 20, 2025

ప.గో : జాతీయ కబడ్డీ పోటీలకు శ్రీకాంత్ ఎంపిక

image

ఆంధ్ర పురుషుల కబడ్డీ జట్టులో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన జి.శ్రీకాంత్ ఎంపికైనట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వై.శ్రీకాంత్ తెలిపారు. ఈ నెల 3వతేదీ నుంచి 18వ తేదీ వరకు విశాఖలో 20 మంది ప్రాబబుల్స్‌కు శిక్షణ జరిగిందన్నారు. దీనిలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది జట్టులో 12 మందిని ఎంపిక చేశారన్నారు.

News February 20, 2025

నిడమర్రు: భార్య ఫోన్ నుంచి మెసేజ్.. ఇంటికి రాగానే హత్య

image

నిడమర్రులోని బావాయిపాలెంలో మజ్జి ఏసు హత్య కేసులో ఏసుబాబు, అన్నవరం, శ్రీనివాసరావును బుధవారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రావణ్ కథనం..పిల్లి ఏసుబాబు భార్యతో మజ్జి ఏసు బాబుకు వివాహేతర సంబంధం ఉంది. పెద్దల సమక్షంలో వార్నింగ్ ఇచ్చినా వారి తీరు మారలేదు. దీంతో పిల్లి ఏసు భార్య ఫోను నుంచి 15 రోజుల ముందు నుంచే పథకం ప్రకారం మెసేజెస్ చేసేవారు. ఈనెల 15న ఆమె ఇంటికి రప్పించుకుని, ఒక చోటుకి తీసుకెళ్లి హత్య చేశారు.

News February 20, 2025

ఏలూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల శిక్ష

image

బాలిక గర్భణి కావడానికి కారణమైన వ్యక్తికి జైలుశిక్ష పడింది. గణపవరం మండలం పిప్పరకు చెందిన దొంగ చిన్నబ్రహ్మయ్య 2014లో పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికను గర్భవతిని చేసి దుబాయ్ పారిపోయాడు. తర్వాత బాలికకు పుట్టిన బిడ్డ చనిపోయింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ ఏలూరు జిల్లా పోక్సో కోర్టు స్టేషన్ జడ్జి సునంద తీర్పు చెప్పారు.

error: Content is protected !!