News August 24, 2025

మట్టి గణపతిని పూజిద్దాం: కలెక్టర్ రాహుల్ రాజ్

image

‘మట్టి గణపతిని పూజిద్దాం.. ప్రకృతిని కాపాడదాం’ అని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్‌లో కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కార్యాలయం రూపొందించిన గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలన్నారు. చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని, పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు సూచించారు.

Similar News

News August 24, 2025

నిజాంపేటలో అనుమానాస్పదంగా మహిళ సూసైడ్

image

నిజాంపేటలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకున్న ఘటన శనివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన బొంబాయి రాజవ్వ(50) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుందని గ్రామస్థులు తెలిపారు. అయితే ఆమె సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

News August 24, 2025

‘మెతుకు సీమలో కనుమరుగవుతున్న కళలు’

image

ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా పల్లెలు ప్రజల సంస్కృతి, జీవన విధానాన్ని ప్రతిబింబించిన జానపదాలు నేడు కనుమరుగైపోయాయి. చెక్కభజనలు, గంగిరెద్దులాటలు ఇప్పుడు చాలా అరుదయ్యాయి. సంక్రాంతి పండుగకు కనిపించే హరిదాసుల గేయాలు, ఒగ్గు కథలు, బొంగురోల ఆటలు కూడా కనుమరుగయ్యాయి. ఆధునిక పరిజ్ఞానం పెరిగిన కొలది పాత జ్ఞాపకాలు తొలగిపోతాయని కొందరూ చర్చించుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్..!

News August 24, 2025

మెదక్: ‘వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి’

image

సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మెదక్ వైద్యాధికారి డా. శ్రీరామ్ అన్నారు. పాపన్నపేట PHCని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులు, రోగులకు మందుల పంపిణీ గురించి ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో చందర్, క్రాంతి, శారద తదితరులు పాల్గొన్నారు.