News August 26, 2025

మట్టి విగ్రహాలనే పూజించాలి: కలెక్టర్

image

ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గణేష్ మట్టి విగ్రహాల పోస్టర్‌ను కలెక్టర్ దివాకర్ టిఎస్ మంగళవారం ఆవిష్కరించారు. మట్టితో చేసిన విగ్రహాలను పూజించాలని సూచించారు. కృత్రిమ పదార్థాలు, రసాయనాలతో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలను పూజించడం వల్ల గాలి, నేల, జల కాలుష్యం జరుగుతుందన్నారు. 8 అంగుళాల మట్టి గణపతి విగ్రహాలను వినియోగించే విధంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రచారం చేస్తుందన్నారు.

Similar News

News August 26, 2025

NZB: భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్

image

గణేశ్ ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్‌లో భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం రాత్రి పరిశీలించారు. ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ ముఖ్యమైన గణేశ్ మండపాలు, ప్రధాన రహదారులు, చౌరస్తాల వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు.

News August 26, 2025

హెచ్ఐవి వ్యాధి వ్యాప్తి అరికట్టేందుకు చర్యలు చేపట్టండి: కలెక్టర్

image

హెచ్ఐ‌వీ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు సంబంధింత శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో 8,680 మందికి హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులను గుర్తించామన్నారు. హెచ్ఐవి వ్యాధి వ్యాప్తి పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

News August 26, 2025

కరీంనగర్: కాంగ్రెస్ ఫ్లెక్సీల దహనం.. సీపీకి ఫిర్యాదు

image

కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను దహనం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్‌లో ఈరోజు సీపీ గౌస్ ఆలంకు ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర సందర్భంగా తెలంగాణ చౌక్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పెట్రోల్ పోసి, నిప్పు అంటించిన బీజేపీ నాయకులపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.