News December 18, 2025
మఠంపల్లి: సుతారి మేస్త్రీ నుంచి సర్పంచిగా..

మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగించే ఓ సామాన్యుడు సర్పంచిగా గెలుపొంది అందరి దృష్టిని ఆకర్షించారు. మఠంపల్లి మం. పెదవీడు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అమరవరపు వెంకటేశ్వర్లు 250ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఆయన మళ్లీ బరిలో నిలిచారు. గ్రామాభివృద్ధికి తోడ్పడే అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సామాన్య కార్మికుడు సర్పంచిగా ఎన్నికవ్వడంతో జిల్లాలో చర్చనీయాంశమైంది.
Similar News
News December 20, 2025
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే కఠిన చర్యలు: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో రోడ్డు నియమాలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం రోడ్డు భద్రత మాసోత్సవాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని.. పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
News December 20, 2025
సురక్షిత డ్రైవింగ్‌తో ప్రమాదాల నివారణ: మంత్రి పొన్నం

సురక్షిత డ్రైవింగ్ విధానంతో రహదారి ప్రమాదాలను నివారించవచ్చని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, రవాణా శాఖ స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, లా అండ్ ఆర్డర్ డిజి మహేష్ భగవత్‌లతో కలిసి హైదరాబాద్ నుంచి రహదారి భద్రత మాసోత్సవాల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
News December 20, 2025
రహదారి భద్రత మాసోత్సవాలు ఘనంగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఈ కార్యక్రమాలలో ప్రజలు, అధికారులు, ఆర్టీసీ డ్రైవర్లను భాగస్వామ్యం చేయాలన్నారు. రోడ్డు భద్రత నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. విద్యార్థుల్లో రహదారి నియమాల పట్ల అవగాహన కలిగేలా వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు.


