News February 3, 2026

మణిపుర్ కొత్త సీఎంగా యుమ్నాం ఖేంచంద్

image

మైతేయి, కుకీ జాతుల మధ్య హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఏడాది కాలంగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపుర్ రాష్ట్రానికి కొత్త CM ఖరారయ్యారు. BJP సీనియర్ నేత, మాజీ స్పీకర్ యుమ్నాం ఖేంచంద్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా ఆ పార్టీ శాసనసభాపక్షం ఎన్నుకుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన.. శాంతి భద్రతల పునరుద్ధరణ, జాతుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పడం వంటి సవాళ్లు ఎదుర్కోనున్నారు.

Similar News

News February 17, 2026

ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు షాక్!

image

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన కంపోజ్ చేసిన దాదాపు 134 సినిమాలకు సంబంధించిన సౌండ్ రికార్డింగ్స్, మ్యూజిక్‌ వాడటంపై తాత్కాలికంగా ఆంక్షలు విధించింది. సరిగమ సంస్థ వద్ద వాటి హక్కులు ఉండటమే కారణం. ఇళయరాజా వీటిని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌‌లో అప్‌లోడ్ చేయడంపై ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. కాగా ఇప్పటికే ఓ తమిళపాట కాపీరైట్ హక్కులపై వీరి మధ్య పోరు నడుస్తోంది.

News February 17, 2026

నా దగ్గర అంత డబ్బు లేదు: మస్క్

image

ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ ఈ ఏడాది ట్రిలియనీర్ అయ్యే ఛాన్స్ 75%పైనే ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందిస్తూ.. తన వద్ద 0.1% కంటే తక్కువ డబ్బు ఉందన్నారు ఎలాన్ మస్క్. ఎక్కువ భాగం టెస్లా, స్పేస్ఎక్స్ వాటాల్లోనే ఉందన్నారు. టెస్లాలో 80%పైగా షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లవేనని తెలిపారు. ప్రస్తుతం మస్క్ సంపద $849.3B కాగా xAI, స్పేస్ఎక్స్ మెర్జ్‌తో ట్రిలియన్ మార్క్ టచ్ కానుందని అంచనా.

News February 17, 2026

కర్తరీ దోషం ఎలా ఏర్పడుతుంది?

image

ఖగోళ గమనం ప్రకారం.. సూర్యుడు మే నెలలో మేష->వృషభ రాశిలోకి కృత్తికా నక్షత్రం గుండా ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి సూర్యుడు రోహిణి నక్షత్రం దాటే వరకు ఉన్న సమయాన్ని కర్తరీగా గణిస్తారు. దీనిని 2 రకాలుగా విభజిస్తారు. సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ఉన్నప్పుడు ‘చిన్న కర్తరీ’, మిగిలిన పాదాల్లో సంచరించేటప్పుడు ‘పెద్ద కర్తరీ’ ఏర్పడుతుంది. ఈ గ్రహ స్థితి వల్ల భూమిపై వేడి గాలులు పెరుగుతాయి.