News November 8, 2025

మణిరత్నం ‘లవ్ స్టోరీ’లో సేతుపతి?

image

క్లాసిక్ లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం మరోసారి ఆ జోనర్‌లో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇందులో విజయ్ సేతుపతి, రుక్మిణీ వసంత్ జంటగా నటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం వారితో చర్చలు జరుగుతున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని టాక్. మణిరత్నం తీసిన బాంబే, రోజా, దిల్ సే, సఖి, గీతాంజలి తదితర చిత్రాలు క్లాసిక్‌లుగా నిలిచిన విషయం తెలిసిందే.

Similar News

News March 29, 2026

KKR విధ్వంసం.. ఒకే ఓవర్లో 26 పరుగులు

image

MIతో జరుగుతున్న మ్యాచులో KKR ఓపెనర్లు రహానే, అలెన్ విరుచుకుపడుతున్నారు. హార్దిక్ వేసిన 4వ ఓవర్లో ఏకంగా 26 రన్స్ బాదారు. తొలుత రహానే 2 సిక్సులు కొట్టగా, అలెన్(37) 3 ఫోర్లు బాదారు. ఒక వైడ్, లెగ్ బైస్ ద్వారా పెద్ద ఓవర్‌గా మారింది. దీంతో 4 ఓవర్లు ముగిసే లోపే జట్టు స్కోర్ 50 పరుగులు దాటింది. MIపై KKRకు ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం విశేషం.

News March 29, 2026

గర్ల్‌ఫ్రెండ్‌కు ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్

image

క్రికెటర్ హార్దిక్ పాండ్య తన ప్రేయసి మహీకా శర్మకు ఖరీదైన కారును గిఫ్టుగా ఇచ్చారు. రూ.1.7కోట్లు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ వీ-క్లాస్‌ను ప్రజెంట్ చేశారు. కారు వద్ద వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో SMలో వైరల్ అవుతోంది. భార్య నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్ మహీకతో రిలేషన్‌లో ఉన్నారు. కాగా ఇటీవల మాజీ భార్య నటాషా, కుమారుడు అగస్త్యకు రూ.4CR విలువైన ల్యాండ్‌రోవర్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే.

News March 29, 2026

GK: జీవశాస్త్రం విశేషాలు

image

☛ మానవ శరీరంలో అతి చిన్న ఎముక: స్టెపిస్ (చెవిలో ఉంటుంది)
☛ అతి పెద్ద ఎముక: ఫీమర్ (తొడ ఎముక)
☛ అతిపెద్ద అవయవం: చర్మం
☛ కణజాలాల అధ్యయనాన్ని ఏమంటారు?: హిస్టాలజీ
☛ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నది: విలియం హార్వే (ENG)
☛ రక్తపోటును కొలిచే పరికరం: స్పిగ్మోమానోమీటర్
☛ యూనివర్సల్ డోనర్ బ్లడ్ గ్రూప్: O నెగటివ్