News January 23, 2025
మణుగూరులో రోడ్డుప్రమాదం.. బీట్ ఆఫీసర్ మృతి

మణుగూరు బీటీపీఎస్ వద్ద బైక్, డీసీఎం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందారు. అతణ్ని ఏడూళ్ల బయ్యారం బోటిగూడెం బీట్ ఆఫీసర్ సాంబశివరావుగా స్థానికులు గుర్తించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News July 9, 2025
HYD: మెట్రో పార్కింగ్.. తప్పించుకోలేరు..!

HYD నగర మెట్రో స్టేషన్లు వద్ద వాహనాలు పార్కు చేసి, ఎవరు చూడని సమయంలో పార్కింగ్ ఫీజు కట్టకుండా బైకులు తీసుకెళ్లినవారు తప్పించుకోలేరని నిర్వాహకులు తెలిపారు. మీరు పార్కు చేసినప్పుడే డిజిటల్ రూపంలో అన్ని వివరాలు పొందు పరుస్తారు. పార్కింగ్ ఫీజు ఆన్ లైన్లో జెనరేట్ అవుతుంది. మరోసారి వచ్చినపుడు కనుక చెల్లిస్తే మీకు తెలియకుండానే గత పెండింగ్ పార్కింగ్ ఫీజు, ప్రస్తుతం ఫీజు కలిపి చెల్లించాల్సి వస్తుంది.
News July 9, 2025
ఇంతేజార్‌గంజ్ సీఐ షుకూర్‌కు ఉత్కృష్ట అవార్డు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇంతేజార్‌గంజ్ సీఐ షుకూర్‌కు ప్రతిష్ఠాత్మక ఉత్కృష్ట అవార్డు దక్కింది. ఆయన డిపార్టుమెంటులో అందించిన అత్యుత్తమ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ఆయనకు ప్రకటించింది. కమిషనరేట్ పరిధిలోని సీఐ ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల సీపీ సన్ ప్రీత్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. షుకూర్‌ను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
News July 9, 2025
NZB: దైవ దర్శనానికి వెళ్లివస్తుండగా ప్రమాదం.. ASI భార్య మృతి

NZB కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు పరిధిలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో NZB పోలీస్ ఇంటలిజెన్స్‌లో పనిచేస్తున్న ASI భీమారావు భార్య భవాని మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. భవాని తన కుమారుడితో కలిసి బాసర అమ్మవారి దర్శనానికి వెళ్లింది. తిరిగి వస్తుండగా వారి బైక్‌కు కుక్క అడ్డు వచ్చింది. దాన్ని తప్పించబోయే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. దీంతో బైక్ వెనకాల కూర్చున్న భవాని మృతి చెందారు.