News May 24, 2024

మణుగూరు నుంచి కోల్ కారిడార్

image

బొగ్గు గనుల ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేస్తున్న కోల్ కారిడర్ మణుగూరు నుంచి ప్రారంభం కానుంది. తాజాగా మణుగూరు – రామగుండం వరకు రైల్వే లైన్‌కు కేంద్రం పచ్చ జండా ఊపింది. ఇందుకుగాను రూ. 2,911 కోట్లు ఖర్చు చేయనుంది. మణుగూరులో ప్రారంభమయ్యే ఈ రైలు ఏటూరు నాగారం మీదుగా ములుగు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. భూపాలపల్లి నుంచి మంథని మీదుగా రామగుండం పరిధిలోని రాఘవాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

Similar News

News February 28, 2026

ఖమ్మం: పేరుకు మాత్రమే పేదల పార్టీ: ఈటల

image

కనికరం లేకుండా పేదల ఆవాసాలను కూల్చివేసి తప్పు జరిగినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా బాధితులకు క్షమాపణ చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పేదలు ఓట్లు వేస్తే గద్దెనెక్కిన ఈ పార్టీ పేరుకు మాత్రమే పేదల పార్టీ అని చేతల్లో మాత్రం రాక్షస పార్టీ అని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని, కూల్చిన చోటే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. లేకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు.

News February 28, 2026

రేపు ఖమ్మంకు నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడి రాక

image

నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆదివారం ఖమ్మంలో పర్యటించనున్నట్లు జిల్లా బీజేపీ నాయకుడు జాటోత్ మధునాయక్ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సా.3 గంటలకు ఎస్టీ కమిషన్ సభ్యుడు వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులను పరామర్శిస్తారని చెప్పారు. అనంతరం భూదాన్ భూముల్లో కూల్చివేసిన ఇళ్లను పరిశీలిస్తారని అన్నారు. ఈ విషయాన్ని అధికారులు, ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.

News February 28, 2026

ఖమ్మం: ముఖ్యమంత్రి గారూ మీ హృదయం ఎందుకు కరగదు?

image

ఖమ్మం భూదాన్ ఘటనలో ఓ ఎస్‌ఐ కూడా బాధితుల పరిస్థితి చూసి కంటతడి పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని MLC తీన్మార్ మల్లన్న గుర్తు చేశారు. పోలీసులే కరిగిపోయారు, మరి ముఖ్యమంత్రి గారూ మీ హృదయం ఎందుకు కరగదు? అని ప్రశ్నించారు. బీసీలపై వివక్ష కొనసాగితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ‘రేపు అసెంబ్లీలో ఇదే అంశంపై గళమెత్తుతాను. ఎవరు అడ్డుకుంటారో చూస్తాను’ అంటూ సవాల్ విసిరారు.