News July 11, 2024
మణుగూరు: వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీసులు ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని రక్షించారు. పట్టణంలోని సురక్షా బస్టాండ్ సమీపంలో జాఫర్ అనే వ్యక్తి పురుగు మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. అనంతరం 100కు ఫోన్ చేసి చెప్పాడు. మణుగూరు బ్లూకోట్ పోలీసులు జాఫర్‌ను గుర్తించి ఆసుపత్రికి తరలించి ప్రాణాలు పోకుండా కాపాడారు. పోలీసులను పలువురు అభినందిస్తున్నారు.
Similar News
News September 15, 2025
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: ఖమ్మం కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డా.పి. శ్రీజతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని, ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా సమాధానం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
News September 15, 2025
పటిష్టం..’పాలేరు’

1928లో పాలేరు చెరువు నిర్మించారు. నాటీ చీఫ్ ఇంజీనీర్ నవాబ్ ఆలీ జంగ్ బహదూర్ పర్యవేక్షణలో చతురస్రాకారం బండరాళ్లు, బంకమట్టి, డంగుసున్నం, కాంక్రీట్ లాంటి సీసంతో నిర్మించారు. చెరువు నుంచి నేటికీ చుక్క నీరు కూడా లీక్ కాకపోవడం నాటి ఇంజీనీర్ల ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు. పాలేరు చెరువు 1978లో రిజర్వాయర్‌గా మారినప్పుడు ఇంజీనీర్లు ఫాలింగ్ గేట్లు ఏర్పాటు చేసి ఘనత సాధించారు. నేడు ఇంజీనీర్స్ డే.
News September 15, 2025
ఖమ్మం: ఐదేళ్ల పోరాటం.. నూతన సొసైటీ ఏర్పాటు

నేలకొండపల్లి మండలంలోని అప్పలనర్సింహాపురం మత్స్యపారిశ్రామిక సంఘం నూతనంగా ఏర్పాటైంది. గ్రామంలోని చెరువుకు సొసైటీ ఏర్పాటు చేసి మత్స్యకారుల అభివృద్ధికి సహకరించాలని వారు గత ఐదేళ్లుగా పోరాటం చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం మత్స్యశాఖను గుర్తించి, గ్రామానికి చెందిన 64 మందికి సభ్యత్వంను అందించారు. కొత్త సొసైటీ ఏర్పాటుపై ఆదివారం మత్స్యకారులు చెరువు వద్ద సంబురాలు నిర్వహించారు.