News March 3, 2026
మత్తు చాక్లెట్లు ఇచ్చి లైంగిక దాడి

TG: ఓ యువతికి యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన బాచుపల్లి(Hyd)లోని బీటెక్ కాలేజీలో జరిగింది. పోలీసుల ప్రకారం.. తనయ్ అనే స్టూడెంట్ అదే కాలేజీలో చదివే యువతికి మాయమాటలు చెప్పి మత్తు చాక్లెట్లు ఇచ్చి క్లాసులోనే పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఆ ఫొటోలు నెట్‌లో పెడతానని బెదిరించాడు. అతని స్నేహితుడూ వేధించాడు. దీంతో ఆత్మహత్యాయత్నం చేయగా ఇంట్లోవాళ్లకు తెలిసి పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News April 13, 2026
స్మార్ట్ గవర్నెన్స్.. సింగపూర్‌కు 9 మంది మంత్రులు

AP: ప్రజలకు స్మార్ట్ గవర్నెన్స్‌ను అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 9 మంది మంత్రులు, ఉన్నతాధికారులకు ట్రైనింగ్ ఇప్పించనుంది. ఈ నెల 21 నుంచి 27 వరకు నారాయణ, అచ్చెన్న, నాదెండ్ల, సత్యకుమార్, అనగాని, నిమ్మల, పయ్యావుల, అనిత, జనార్దన్ సింగపూర్‌లో పర్యటించనున్నారు. రోజుకొక అంశంపై వారం రోజులపాటు శిక్షణ ఉంటుంది. వారు తిరిగొచ్చాక ఇతర ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తారు.
News April 13, 2026
అన్నదాతకు ‘ఉల్లి’పోటు.. భారీగా పడిపోయిన ధర

TG: ఉల్లి ధరలు రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. సంగారెడ్డి(D) సదాశివపేట మార్కెట్‌లో గతేడాది APRలో రూ.2,300 పలికిన క్వింటాల్ ఉల్లి తాజాగా రూ.504కు పడిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతోంది. JAN-MAY మధ్య భారీగా దిగుబడి వస్తుంది. దీంతో ధరలు పతనమయ్యాయి. హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో వ్యాపారులు రూ.100కు 5-8 కిలోల వరకు ఉల్లి విక్రయిస్తున్నారు.
News April 13, 2026
సెన్సస్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్, జైలు శిక్ష

AP: సెన్సస్-2027లో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు అవకాశం ఉంటుంది. మే 1 నుంచి క్షేత్రస్థాయి గణన ప్రారంభం కానుంది. అధికారులు జనాభా లెక్కల కోసం వచ్చినప్పుడు ఇళ్ల యజమానులు అనుమతించాలని ప్రభుత్వం సూచించింది. ‘వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇదే రూల్ అధికారులకూ వర్తిస్తుంది’ అని పేర్కొంది.


