News November 19, 2025

మత్తు పదార్థాల జోలికి యువత పోవద్దు: సీపీ సన్‌ప్రీత్ సింగ్

image

యువత మత్తు పదార్థాల జోలికి పోవద్దని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ మెడికల్ విద్యార్థులకు సూచించారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Similar News

News April 5, 2026

హాజరుకాని వారికి నోటీసులు: ZP ఛైర్మన్

image

చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జడ్పీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరవడంతో నోటీసులు పంపించాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు సూచించారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేరుశెనగ విత్తనాలను సకాలంలో పంపిణీ చేయాలన్నారు. మామిడి రైతులకు సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

News April 5, 2026

సంగారెడ్డి: ఉచిత శిక్షణ.. APPLY

image

స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో ఫ్రిజ్ & ఏసీ రిపేర్ &సర్వీసింగ్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాలలోపు ఉన్న సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ యువకులు అర్హులని చెప్పారు. దరఖాస్తులలో బైపాస్ రహదారిలోని కార్యాలయంలో గాని, 94901 03390 నంబర్‌కు వాట్సప్ చేయాలని సూచించారు.

News April 5, 2026

కోర్టు కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్

image

పుట్టపర్తి కలెక్టరేట్‌లో హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కోర్టు ధిక్కరణ కేసులు, రిట్ పిటిషన్లపై కలెక్టర్ శనివారం శ్యాంప్రసాద్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసులకు సంబంధించిన కౌంటర్ అఫిడవిట్లను వెంటనే దాఖలు చేయాలని, కోర్టు ఇచ్చిన గడువులోగా నివేదికలు సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. న్యాయపరమైన అంశాల్లో నిర్లక్ష్యం చేస్తే వ్యక్తిగత బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.