News April 10, 2024

మత్తు పదార్థాల నుంచి యువతను కాపాడుకుందాం: వరంగల్ సీపీ

image

నేటి యువతను మత్తు పదార్థాలకు బానిస కాకుండా కాపాడుకుందామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో ఆధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలపై రూపొందిన వాల్‌ పోస్టర్‌ను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ బుధవారం అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News April 20, 2025

వరంగల్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెండ్

image

వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ CP సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. తరిగొప్పుల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బాలాజీ, కానిస్టేబుల్ రాజు ఓ కేసు విషయంలో నిందితుడికి సహకారం అందించేందుకు ప్రయత్నించారు. నిందితుడి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లుగా వచ్చిన ఆరోపణలు విచారణలో రుజువవడంతో వారిని సస్పెండ్ చేశారు.

News April 20, 2025

KU డిగ్రీ పరీక్షలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి జరగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు తమ విద్యార్థుల పరీక్ష ఫీజును చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. II, IV, VI (రెగ్యులర్) & I, III, V సెమిస్టర్‌ల (బ్యాక్‌లాగ్‌) పరీక్షలు వాయిదా వేశామని చెప్పారు. పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

News April 20, 2025

వరంగల్: ‘గిరికతాటి’ కల్లుకు కేరాఫ్ ‘పాకాల’

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరకతాటి కల్లు ఎక్కడ దొరుకుతుందంటే ఠక్కున గుర్తొచ్చేది ఖానాపురం మండలం పాకాల. నర్సంపేట నుంచి పాకాలకు వెళ్లే దారి మధ్యలో సుమారు 60 గిరికతాటి చెట్లు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవి, పక్కనే పాకాల వాగు వద్ద దొరికే ఈ కల్లు కోసం HYD, WGL, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రతి ఏటా వేలం పాటలో గీతకార్మికులు ఈ చెట్లను దక్కించుకుంటారు. ఇక్కడ కుండ చికెన్ కూడా ఫేమస్.

error: Content is protected !!