News February 2, 2026
మత్స్యకారులకు బడ్జెట్‌లో భరోసా

మత్స్యకారుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. భారత నౌకలు అంతర్జాతీయ జలాల్లో వేటాడే చేపలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. ఇది డీప్‌సీ ఫిషింగ్ చేసే బోటు యజమానులకు ఊరటగా చెప్పవచ్చు. అలాగే రొయ్యలు, చేపల ప్రాసెసింగ్‌లో వాడే ముడిసరుకుల దిగుమతి సుంకం మినహాయింపు పరిమితిని 1% నుంచి 3%కు పెంచారు. ఇది ఆక్వా పరిశ్రమలకు లాభదాయకం.
Similar News
News February 18, 2026
ఫాల్గుణ మాసంలో ఎవరెవరు పుట్టారంటే?

ఫాల్గుణ మాసం అనేక పురాణ పురుషుల, మహాత్ముల జన్మలకు వేదిక. ఈ మాసంలోనే హరిహరసుతుడు అయ్యప్పస్వామి, పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించారు. శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతి వంటి మహనీయులు కూడా ఈ మాసంలోనే జన్మించారు. అర్జునుడు, ధర్మరాజు, భీముడు ఈ మాసంలోనే జన్మించారు. కొందరు కౌరవ వీరులు కూడా ఫాల్గుణ మాసంలోనే జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
News February 18, 2026
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) ఇంజినీర్, Jr. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, తదితర పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు FEB 25 నుంచి మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష(CBT), గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. వెబ్‌సైట్: https://www.hindustanpetroleum.com/
News February 18, 2026
PPP మోడల్‌లో వంద పడకల ఆస్పత్రులు: మంత్రి సత్యకుమార్

AP: ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదని భావించే కూటమి ప్రభుత్వం వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోందని మంత్రి సత్యకుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. ఆళ్లగడ్డ, కొవ్వూరు వంటి ప్రాంతాల్లో ఆస్పత్రుల సామర్థ్యం పెంచాలన్న సభ్యుల విజ్ఞప్తిపై స్పందిస్తూ.. 50 పడకల కన్నా తక్కువ సౌకర్యాలున్న 61 నియోజకవర్గాలను గుర్తించామన్నారు. మొదట PPP మోడల్‌లో అక్కడ 100 పడకల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామన్నారు.


