News April 8, 2025
మత్స్య శాఖ సహాయ సంచాలకుడి బాధ్యతల స్వీకరణ

బాపట్ల మత్స్య శాఖ సంయుక్త సంచాలకుడిగా కే శ్రీనివాస నాయక్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. తిరుపతి జిల్లాలో మత్స్యశాఖ ఉప డైరెక్టర్‌గా పనిచేస్తూ ఆయన పదోన్నతిపై జిల్లాకు మత్స్యశాఖ సంయుక్త డైరెక్టర్‌గా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ వెంకట మురళి, జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News December 24, 2025
కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో మొబైల్ ఫోన్ల రికవరీ

పోగొట్టుకున్న/ దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను వెలికితీసి బాధితులకు అందించడంలో కామారెడ్డి జిల్లా పోలీసులు విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. CIER ద్వారా ఈ ఏడాది ఇప్పటివరకు 1,722 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు ₹2.75 కోట్లు ఉంటుందని SP తెలిపారు. CEIR వ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటి నుండి జిల్లాలో మొత్తం 4,169 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.
News December 24, 2025
చైనా గుబులు: AI ఎక్కడ తిరగబడుతుందోనని ఆంక్షలు

AI రేసులో ముందున్నామని ప్రకటిస్తున్న చైనా లోలోపల మాత్రం ఈ అత్యాధునిక టెక్నాలజీ పట్ల ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. స్వతంత్రంగా డేటాను విశ్లేషించి సమాధానాలిస్తున్న చాట్‌బాట్‌లు ఎక్కడ తమ కమ్యూనిస్టు ప్రభుత్వ విధానాలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయోనని కంగారు పడుతోందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. AI మోడల్స్ ట్రైనింగ్ దశలోనే ప్రభుత్వ వ్యతిరేక డేటాపై జాగ్రత్తలు తీసుకునేలా మార్గదర్శకాలు జారీ చేసింది.
News December 24, 2025
పెద్దపల్లిలో ప్రిమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

పెద్దపల్లిలో జూనియర్ కళాశాల మైదానంలో మొదటిసారిగా పెద్దపల్లి ప్రిమియర్ లీగ్ (PPL) క్రికెట్ టోర్నమెంట్‌ను MLA చింతకుంట విజయరమణరావు ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి, యువతను చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉంచి క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలని సూచించారు. టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి జట్టుకూ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


