News September 24, 2025
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కేసులు: DSP

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ DSP జీవన్ రెడ్డి హెచ్చరించారు. జందపూర్‌లో ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో నిందితురాలిపై రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనపై ప్రజలు ఎలాంటి దుష్ప్రచారాలు వ్యాప్తి చేయకుండా ఉండాలని సూచించారు. మహిళకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయవద్దని సూచించారు.
Similar News
News September 24, 2025
ADB: తరగతులు బోధించడానికి దరఖాస్తులు

డా.బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ అధ్యాయన కేంద్రాల్లో కాంటాక్ట్ పద్ధతిన కౌన్సెలింగ్ తరగతులు బోధించడానికి అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత పేర్కొన్నారు. బోధన అనుభవం, పీహెచ్డి, నెట్, సెట్, పీజీ సంబంధిత సబ్జెక్టులలో 50% మార్కులు కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హులు www.braou.ac.inలో అక్టోబర్ 10 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
News September 24, 2025
ఉట్నూర్: ఆర్టీసీలో ఉద్యోగాలు

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్స్, శ్రామిక్ పోస్టుల భర్తీ కోసం స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చెసిందని, అర్హులైన గిరిజనులు దరఖాస్తు చేసుకోవాలని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్భూగుప్తా తెలిపారు. ఉమ్మడి ADBజిల్లాలోని అర్హులైన గిరిజన యువత మరిన్ని వివరాల కోసం ఐటీడీఏలోని GSUK కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
News September 23, 2025
ADB: సాయితేజకు కన్నీటి వీడ్కోలు

ఉట్నూర్‌కు చెందిన సాయితేజ సీనియర్ల వేధింపులకు గురై హైదరాబాద్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి మృతదేహాన్ని మంగళవారం ఉట్నూర్‌కు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్థులు, కుటుంబీకులు సాయితేజకు కన్నీటి వీడ్కోలు పలికారు. యువత ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చవద్దని గ్రామస్థులు కోరారు.