News September 20, 2025
మదనపల్లి: టార్పెంట్ ఆయిల్ తాగి రెండేళ్ల చిన్నారి మృతి

టార్పెంట్ ఆయిల్ తాగి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన శుక్రవారం మదనపల్లిలో జరిగింది. టూటౌన్ పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని సైదాపేటకు చెందిన సాదియా రీలింగ్ పనిచేసేందుకు వెలుతు తన కుమార్తె అలిజ(2)ను తీసుకెళ్లింది. చంద్రకాలనీ రీలింగ్ కేంద్రంలో వదలడంతో చిన్నారి నీళ్లు అనుకోని టార్పెంట్ ఆయిల్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. చిన్నారిని వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందింది.
Similar News
News September 20, 2025
భువనగిరి: భార్యను నరికి చంపిన భర్త

మోత్కూర్: అడ్డగూడూరుకు చెందిన శంకర్ తన భార్య మంజులను HYDలో కత్తితో నరికి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం.. 4 రోజుల క్రితం శంకర్ తన ఫ్యామిలీతో కలిసి కుషాయిగూడ మహేశ్ నగర్ కాలనీలో ఉంటున్న సోదరి ఇంటికి వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక తన భార్యను కత్తితో హత్యచేసి పరారయ్యాడు. దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News September 20, 2025
MDK: పింఛన్ ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు..?

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటితో 20 నెలలు పూర్తయ్యాయి. ఎన్నికల ముందు ప్రచార సభల్లో పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చింది. ఒంటరి మహిళలు, నేత కార్మికులు, వృద్ధులకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6 వేల వరకు పింఛన్లు పెంచుతామని తెలిపింది. అయితే ఇంతవరకు పెన్షన్ల పెంపు ముచ్చట లేదు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 4,69,575 పింఛన్‌దారులు పెంపు కోసం ఎదురుచూస్తున్నారు.
News September 20, 2025
SCRలో 14 పోస్టులకు నోటిఫికేషన్

సౌత్ సెంట్రల్ రైల్వే(SCR)లో స్కౌట్స్& గైడ్స్ కోటా కింద 14 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు ఆయా విభాగాల్లో అర్హత సాధించి ఉండాలి. వయసు 18-33 ఏళ్లలోపు ఉండాలి. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి OCT 19 వరకు అప్లై చేసుకోవచ్చు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, నాందేడ్, గుంటూరు డివిజన్లలో రెండేసి చొప్పున పోస్టులను భర్తీ చేస్తారు.
వెబ్‌సైట్: <