News August 5, 2025

మదనపల్లి సబ్ కలెక్టర్‌గా శ్రీకాకుళం వాసి

image

అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్‌గా చల్లా కళ్యాణినిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని ఒప్పంగి గ్రామానికి చెందినవారు. 2023 బ్యాచ్‌లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరారు. గతంలో కర్నూలులో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ మదనపల్లికి బదిలీ అయ్యారు.

Similar News

News September 11, 2025

గోకర్ణపురం పాఠశాలను సందర్శించిన కలెక్టర్

image

కంచిలి మండలం గోకర్ణపురం ఎంపీపీ పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సందర్శించారు. పాఠశాలలో రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం తరగతి గదుల్లో ‘యూ’ ఆకృతిలో చేపట్టిన బోధన విధానంపై ఆరా తీశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, పుస్తకాలను పరిశీలించారు. పాఠశాల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ-1 ఎస్ శివరాం ప్రసాద్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

News September 11, 2025

శ్రీకాకుళం: ‘జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అవ్వాలి’

image

శ్రీకాకుళం జిల్లాలో 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా సంబంధిత పోలీసు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డీ ఆదేశించారు. బుధవారం SP కార్యాలయం నుంచి జిల్లాలో ఉన్న డీఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో వీసి నిర్వహించారు. పోలీసు స్టేషను స్థాయిలో రాజీ అయ్యేందుకు అవకాశం ఉన్న కేసులను ముందుస్తుగా గుర్తించాలన్నారు.

News September 10, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤నరసన్నపేట: గ్యాస్ లీకై.. వ్యాపించిన మంటలు
➤పాతపట్నం: బురదలో కూరుకుపోయిన లారీ.. ట్రాఫిక్ జామ్
➤టెక్కలి: మండుటెండలో విద్యార్థుల అవస్థలు
➤ఎచ్చెర్ల: అంబేడ్కర్ వర్శిటీ నూతన రిజిస్ట్రార్‌గా అడ్డయ్య
➤సరుబుజ్జిలి: ధర్మల్ ప్లాంట్‌ను వ్యతిరేకించిన ఆదివాసీలు
➤శ్రీకాకుళం: 11న డయల్ యువర్ ఆర్ఎం
➤ఆమదాలవలస: వివాహిత ఆత్మహత్య..నలుగురికి రిమాండ్