News January 8, 2026
‘మదన’పల్లె

మదనపల్లె మదనపడుతోంది. జిల్లా కేంద్రం అయినా.. అక్కడ జరుతున్న పరిణామాలు, వెలుగుచూస్తున్న ఘటనలతో కలవరపెడుతోంది. ఇప్పటికే కల్తీమద్యం తయారీతో జిల్లాకు ఒక మచ్చ ఏర్పడితే.. అక్కడే కడ్నీ రాకెట్ వ్యవహారం బయటపడటంతో ఆ ప్రాంత పల్లెలు హడలెత్తారు. దీనికి తోడు జిల్లా ఆసుపత్రిలో నిర్వహణ లోపం, క్రైం రేట్లో టాప్‌లో నిలవడం, నిన్న ఏకంగా ఫేక్ కరెన్సీ ముఠా అరెస్ట్‌తో మదనపల్లె వాసులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News January 10, 2026
TU: పీజీ పరీక్షలు వాయిదా.. షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తాం: COE

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని M.A/M.Com/MSW/M.Sc/MBA/MCA 3వ సెమిస్టర్, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ 9వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. త్వరలో పరీక్షల నూతన షెడ్యూల్ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. వాయిదా పడిన పరీక్షల వివరాలను విద్యార్థులు గమనించాలన్నారు.
News January 10, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 10, శనివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.23 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.59 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.15 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 10, 2026
వారి మధ్య సమన్వయ లోపం.. వీరికి శాపం.?

చిత్తూరు(D)లో 600, తిరుపతి(D)లో 700 పైచిలుకు గ్రామ <<18813468>>పంచాయతీలు<<>> ఉన్నాయి. ఒక్కో పంచాయతీలో 80-100కు పైగా వీధి కుక్కలు ఉంటాయని అంచనా. పంచాయతీ అధికారులు ప్రత్యేకంగా డ్రైవ్స్ నిర్వహించి, కుక్కలను బోనులో బంధించాలి. యానిమల్ హస్బెండరీ అధికారుల చేత యాంటీ రేబీస్ వ్యాక్సిన్, ABC ప్రోగ్రామ్ నిర్వహించాలి. రెండు శాఖల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో ర్యాబిస్ వాక్సిన్ కార్యక్రమం నీరుగారిపోతోందని పలువురు అంటున్నారు.


