News June 18, 2024

మదనపల్లెలో KG టమాటా రూ.80

image

ఆసియాలోనే మదనపల్లె టమాటా మార్కెట్ అతిపెద్దది. దేశంలో ఎక్కడ ధరలు పెరిగినా ఇక్కడి రేటు ఎంతో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతుంటారు. కాగా మంగళవారం ఇక్కడ కిలో టమాటా రూ.80 పలికిందని మార్కెట్ అధికారులు వెల్లడించారు. గత శుక్రవారం ఇక్కడ రూ.50 ఉండగా నాలుగు రోజులకే ధర బాగా పెరిగింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 20, 2025

చిత్తూరు: రేపు 2 లక్షల మందికి టీకాలు.!

image

ఈఏడాది జిల్లాలో 2,21,502 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఆదివారం నుంచి మూడు రోజులు ఈ ప్రోగ్రాం జరగనుంది. జిల్లా వ్యాప్తంగా 5,794 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు ఈ కేంద్రాల వద్ద, మిగిలిన రెండు రోజులు సిబ్బంది ఇంటింటికీ తిరిగి వేయనున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో మొబైల్ టీమ్స్ అందుబాటులో ఉండనున్నాయి. పేరంట్స్ చిన్నారులకు తప్పక టీకాలు వేయించాలి.

News December 20, 2025

చౌడేపల్లి: ‘సచివాలయ సిబ్బందికి జీతాలు నిలుపుదల’

image

చౌడేపల్లె మండలం చారాల సచివాలయంలోని పలువురి సిబ్బందికి మూడు నెలల జీతాలను నిలుపుదల చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఓం ప్రసాద్, కృష్ణమూర్తి, హిమబిందు, సోమశేఖర్, మహమ్మద్ ఆరీఫ్ లకు జీతాలు నిలుపుదల చేయాలని అధికారులు ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతోనే వారికి జీతాలు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

News December 20, 2025

చిత్తూరు: తగ్గుతున్న చెరకు సాగు

image

చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ వాణిజ్య పంటగా ఉన్న చెరకు సాగు క్రమేపి తగ్గుతోంది. సాగు వ్యయం అధికమవుతుండడం, కూలీలు దొరక్క పోవడం, చక్కెర ఫ్యాక్టరీలు మూతపడటంతో రైతులు క్రమేపి ఇతర పంటలకు మల్లుతున్నారు. సాగు చేసిన వారు తప్పనిసరిగా బెల్లం తయారు చేయాల్సి వస్తోంది. 2020లో ఉమ్మడి జిల్లాలో 9,900 హెక్టార్లలో చెరకు సాగు కాగా.. ప్రస్తుతం 6,500 హెక్టార్లలో మాత్రమే సాగులో ఉంది.