News September 12, 2025
మదనపల్లె: ఇళ్లల్లో చోరీలకు పాల్పడే దొంగకు రెండేళ్ల జైలు

ఇళ్లల్లో చోరీలకు పాల్పడే దొంగకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మదనపల్లె రెండవ అదనపు జ్యుడీసియల్ కోర్టు జడ్జి గురువారం తీర్పు ఇచ్చినట్లు టూ టౌన్ సీఐ రాజారెడ్డి తెలిపారు. మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో రెండు ఇళ్లల్లో దొంగతనం చేసిన కేసులో చీకిలగుట్టలో ఉండే కావడి సోమశేఖర్‌ను అప్పటి పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ జరిగి, నేరం రుజువుకావడంతో శిక్ష పడింది.
Similar News
News September 12, 2025
కావలి: ఇంట్లోనే సమాధులు.. భయం లేకుండానే కాపురాలు

శ్మశాన వాటిక సమీపంలో ఉందంటేనే నివాసం ఉండేందుకు కూడా చాలా మంది భయపడుతుంటారు. కానీ కావలిలో మాత్రం సమాధులతోనే కొందరు సావాసం చేస్తున్నారు. గతంలో అక్కడి పెద్దలు శ్మశానానికి 70 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమి అన్యాక్రాంతం అయింది. సమాధులు ఆక్రమించుకుని మరీ ఇల్లును నిర్మించుకోవడంతో, ఇంటి ముందే సమాధులు దర్శనమిస్తున్నాయి. భయం లేకుండానే కాపురాలు చేస్తున్నారు.
News September 12, 2025
MBNR: అడ్డాకులలో అత్యధిక వర్షపాతం నమోదు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గడిచిన 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా అడ్డాకుల 23.5 మిల్లీమీటర్ల వర్షం పడింది. చిన్నచింతకుంట 23.3, బాలానగర్ 15.3, మిడ్జిల్ 13.3, హన్వాడ 11.0, మహమ్మదాబాద్ 10.8, కౌకుంట్ల 7.3, సల్కర్ పేట 7.3, భూత్పూర్ 6.3, నవాబుపేట 6.0 మిల్లీమీటర్ల వర్షం రికార్డు అయింది.
News September 12, 2025
ANUలో ఏపీ పీజీ సెట్ విద్యార్థులకు ఇబ్బందులు

ఏపీ పీజీ సెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఆలస్యం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసింది. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులను గురువారం పెదకాకానిలోని నాగార్జున విశ్వవిద్యాలయానికి పిలిచినా, తీరా చివరి నిమిషంలో వాయిదా వేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు నిరాశ చెందగా, అధికారులు కేవలం పేర్లు, హాల్ టికెట్ వివరాలు మాత్రమే నమోదు చేశారు. ఈ నిర్లక్ష్యంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.