News April 16, 2025

మదనపల్లె: ఉచ్చులో చిక్కుకున్న చిరుత పులి

image

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నూటి పాలెం వద్ద రైతులు వన్య ప్రాణుల నుంచి పంట రక్షణకు పొలాల చుట్టూ అమర్చిన ఉచ్చులో మంగళవారం రాత్రి ఓ చిరుత పులి చిక్కుకుంది. ఉదయాన్నే గమనించిన రైతులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి సమీపంలోకి చిరుత రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు భయాందోళన చెందుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News March 2, 2026

గద్వాల్: హోలీ పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

image

జిల్లాలో హోలీ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టిందని ఎస్పీ టి. శ్రీనివాసరావు వెల్లడించారు. రంజాన్, హోలీ ఒకే సమయంలో వస్తున్న నేపథ్యంలో ప్రజలు సోదరభావంతో మెలగాలని పిలుపునిచ్చారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మత పెద్దల సహకారంతో శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.

News March 2, 2026

గద్వాల: మైనారిటీ యువతులకు ఉచిత టైలరింగ్ శిక్షణ

image

తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని మైనారిటీ యువతులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి నుషిత సోమవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 10వ తేదీలోపు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గల జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం (రూమ్ నెం. F-8) నందు సమర్పించాలని ఆమె సూచించారు.

News March 2, 2026

సీపీఎంలో తమ్మినేనిపై ‘ఎదురుగాలి’

image

సీపీఎంలో తిరుగులేని నేతగా వెలుగొందిన తమ్మినేని వీరభద్రం ప్రస్తుతం పార్టీలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈరోజు పొలిట్‌బ్యూరో సమావేశంలో ఆయన పనితీరుపై చర్చ జరిగినట్లు సమాచారం. తీరు మార్చుకోవాలని అధిష్ఠానం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో గ్రూపు రాజకీయాల వల్ల దెబ్బతిన్న క్యాడర్‌ను బుజ్జగించేందుకు జాతీయనేతలు రంగంలోకి దిగారు. జిల్లా రాజకీయాల్లో తమ్మినేని పట్టు సడలడం చర్చనీయాంశంగా మారింది.