News March 4, 2025

మదనపల్లె: ఉద్యోగం పేరుతో మోసపోయిన అమ్మాయిలు

image

ఉద్యోగం పేరుతో ముగ్గురు అమ్మాయిలు మోసపోయిన ఘటన మదనపల్లెలో జరిగింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి(M)కి చెందిన ముగ్గురు అమ్మాయిలు డిగ్రీ చదివారు. వారికి మదనపల్లెలోని ఓ ప్రైవేట్ కంపెనీ జాబ్ ఆఫర్ చేసింది. రూ.18వేలు జీతం అని మాయమాటలు చెప్పారు. ఉద్యోగంలో చేరాలంటే రూ.45వేలు కట్టాలనడంతో నిర్వాహకులకు డబ్బులు చెల్లించారు. తీరా వారు జాబ్‌లో చేరిన తరువాత మోసపోయామని గ్రహించడంతో పోలీసులను ఆశ్రయించారు.

Similar News

News November 14, 2025

సంచలనం.. రికార్డు సృష్టించిన నవీన్ యాదవ్

image

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సంచలనం సృష్టించారు. మెజారిటీలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, విష్ణు రికార్డును బ్రేక్ చేశారు. ఇదివరకు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ రికార్డు 2009లో విష్ణు(కాంగ్రెస్) పేరిట ఉంది. ఆయన 21,741 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తాజా ఉపఎన్నికలో నవీన్ యాదవ్ దాదాపు 25వేల ఓట్ల మెజారిటీతో గెలిచి ఆ రికార్డును బ్రేక్ చేశారు.

News November 14, 2025

PDPL: శాండ్ రీచ్‌లను ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం

image

పెద్దపల్లి జిల్లాలోని 19 శాండ్ రీచ్‌లు ఆగిపోవడంతో ప్రభుత్వం ఏడాదికి రూ.200 కోట్ల ఆదాయం కోల్పోతుంది. సహజ సంపదను తోడేయడంతో జీవవైవిధ్యం దెబ్బతింటుందంటూ మానేరు పరివాహక పరిరక్షణ సమితి NGTని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన NGT.. శాండ్ రీచ్‌లను నిలిపివేయాలని కలెక్టర్‌కు 2023లో ఆదేశాలు జారీచేసింది. అయితే ఈనెలలో NGT స్టేను వెకేట్ చేసి రీచ్‌లను ఓపెన్ చేసి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

News November 14, 2025

WGL మార్కెట్‌కు తేజ షార్క్ కొత్త మిర్చి రాక

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం తేజ షార్క్ కొత్తమిర్చి 8 బస్తాలు వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. క్వింటాకు రూ.15,111 ధర వచ్చిందన్నారు. అలాగే టమాటా మిర్చి సైతం నేడు మార్కెట్‌కు రాగా రూ.30 వేల ధర పలికిందని చెప్పారు. మరోవైపు మక్కలు (బిల్టీ) క్వింటా రూ.2,075 ధర వచ్చింది.