News April 8, 2025
మదనపల్లె: కానిస్టేబుల్ జయప్రకాష్ దుర్మరణం

మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న కానిస్టేబుల్ జయప్రకాశ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. శనివారం తన కొడుకుకి ఆరోగ్యం బాగాలేక చికిత్స కోసం బెంగుళూరు వెళ్లాడు. సిటీలో హాస్పిటల్‌కు వెళ్తుండగా బుల్లెట్ బైక్ ఢీకొని తలకు బలమైన గాయలయ్యాయి. అక్కడ చికిత్స చేయించి, తిరుపతి నారాయణద్రి హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ సోమవారం ఆయన మృతిచెందాడు.
Similar News
News April 8, 2025
వనపర్తి: తహశీల్దార్లు రేషన్ షాపులను తనిఖీ చేయండి: కలెక్టర్

వనపర్తి జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్లు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీపై పర్యవేక్షణ ఉంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఎక్కడా దొడ్డు బియ్యం, సన్న బియ్యం కలిపి పంపిణీ చేయవద్దని సూచించారు. అలాంటి పనులు ఎక్కడైనా జరిగితే చర్యలు తీసుకుంటామని సదరు రేషన్ షాపు డీలర్ లైసెన్స్ క్యాన్సల్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. తహశీల్దార్లు రేషన్ షాపులను విజిట్ చేసి తనిఖీలు చేయాలన్నారు.
News April 8, 2025
వనపర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి: కలెక్టర్

వరికోతలు ప్రారంభమైన అన్ని గ్రామ పంచాయతీలు, హ్యాబిటేషన్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రంలో తేమ, తూకం యంత్రాలు, టర్పాలిన్‌లు, గన్ని బ్యాగులు, ధాన్యం శుభ్రం చేసే మిషన్లు లేదా ఫ్యాన్‌లు కచ్చితంగా ఉండాలన్నారు.
News April 8, 2025
మెదక్: నేటి నుంచి పదోతరగతి మూల్యాంకనం

రామచంద్రపురం మండలంలోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలో నేటి నుంచి నిర్వహించే టెన్త్ క్లాస్ సమాధాన పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 1,222 మంది ఉపాధ్యాయులు మూల్యాంకనంలో పాల్గొంటారన్నారు. టెన్త్ మూల్యాంకన కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.