News December 10, 2024
మదనపల్లె: కొడవలితో 10వ తరగతి విద్యార్థి హల్‌చల్

రాయచోటిలో విద్యార్థుల దాడిలో ఓ టీచర్ మృతిచెందిన ఘటన మరువక ముందే మదనపల్లెలో ఆ తరహా ఘటనే వెలుగు చూసింది. నీరుగట్టువారిపల్లెలోని ఓ స్కూల్లో 10వ తరగతి విద్యార్థి బ్యాగులో సోమవారం కొడవలి దాచుకుని వెళ్లాడు. క్లాస్‌లోని తోటి విద్యార్థులకు కొడవలి చూపించడంతో వారు భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన టీచర్లు, హెచ్ఎం పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వెళ్లి విద్యార్థి పేరంట్స్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు.
Similar News
News September 18, 2025
జిల్లాలో 3,293 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ: కలెక్టర్

జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు, కుప్పం, పలమనేరు, పుంగనూరు, నగరి నియోజకవర్గ పరిధిలోని 125 క్లస్టర్లలో 3,293 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాలు, సొసైటీలలో యూరియా పంపిణీ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
News September 18, 2025
కోచింగ్ లేకుండానే టీచర్ అయ్యాడు..!

SRపురం(M) కొత్తపల్లిమిట్టకి చెందిన ప్రభుకుమార్ టీచర్ ఉద్యోగం సాధించాడు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఇంటి నుంచే ప్రిపేర్ అయ్యాడు. తండ్రి ఏసుపాదం రెండేళ్ల క్రితం చనిపోగా.. తల్లి మణియమ్మ రోజు కూలికి వెళ్లి ఇంటి బాగోగులు చూస్తున్నారు. ఉద్యోగం రావడంతో ఇక అమ్మను కూలి పనులకు పంపకుండా బాగా చూసుకుంటానని ప్రభు కుమార్ తెలిపాడు.
News September 18, 2025
చిత్తూరు: రెండేళ్ల క్రితం హత్య.. ఇప్పుడు వెలుగులోకి

బంగారుపాళ్యం(M) బలిజపల్లికి చెందిన చెంచులక్ష్మి భర్త చనిపోగా శేషాపురానికి చెందిన దేవేంద్రతో వివాహేతర బంధం ఏర్పడింది. పెనుమూరు(M) సామిరెడ్డిపల్లిలోని ఓ మామిడి తోటలో కాపలా పనికి 2023లో ఇద్దరు వచ్చారు. అప్పట్లోనే వాళ్ల మధ్య గొడవ జరగ్గా చెంచులక్ష్మిని దేవేంద్ర నీటిలో ముంచి చంపేశాడు. తోటలోనే డెడ్‌బాడీని పాతిపెట్టి ఆమె ఎటో వెళ్లిపోయిందని మృతురాలి తల్లిని నమ్మించాడు. పోలీసులు నిన్న అతడిని అరెస్ట్ చేశారు.