News November 19, 2024
మదనపల్లె దస్త్రాల దహనం కేసుపై వాడీవేడి చర్చ

మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో దస్త్రాల దహనం కేసుపై శాసన మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో ఎంతటి వారున్నా వదిలిపెట్టమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుని మంత్రి ప్రస్తావించడంతో MLC బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా CID విచారణలో పేర్కొన్న అంశాలనే తాను చెప్పానని అనగాని అన్నారు.
Similar News
News January 29, 2026
చిత్తూరులో కేంద్రీయ విద్యాలయంలో కార్యకలాపాలు ప్రారంభం

చిత్తూరు జిల్లా మంగసముద్రంలో కొత్త కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2026–27 విద్యా సం. నుంచి ఈ విద్యాలయం కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఎదురుగా తాత్కాలిక భవనాల్లో I నుంచి Vవ తరగతి వరకు బోధన ప్రారంభమవుతుంది. భూమి బదిలీ పూర్తికావడంతో అడ్మిషన్లను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నారు.
News January 28, 2026
అందుబాటులోకి ఆయుష్మాన్ భారత్ కార్డులు

చిత్తూరు జిల్లాలో ఆయుష్మాన్ భారత్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో సుమారు 20 లక్షల మంది ఉన్నారు. వీరిలో 17 లక్షల మంది వివరాలను కార్డులో అధికారులు నమోదు చేయించారు. రోగి పూర్తి వివరాలు కార్డు స్కాన్ చేయడం ద్వారా వైద్యులకు తెలిసిపోతుంది. తద్వారా వైద్య సేవలు అందించడం సులభతరం కానుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రుల్లోనే కాకుండా జిల్లా, ఏరియా, సిహెచ్సీలోనూ వీటి ద్వారా వైద్య సేవలు అందనున్నాయి.
News January 28, 2026
చిత్తూరుకు మరో 450 టన్నుల యూరియా

కడప జిల్లా నుంచి మరో 450 టన్నుల యూరియా చిత్తూరు జిల్లాకు బుధవారం రానుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,301 టన్నుల యూరియా నిల్వలున్నాయన్నారు. వీటిని 230 రైతు భరోసా కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా అందిస్తున్నామని వెల్లడించారు.


