News March 20, 2024
మదనపల్లె: పిల్లలు పుట్టలేదని విషం తాగిన దంపతులు

బి కొత్తకోటలో విషం తాగి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం.. స్థానిక రంగసముద్రం రోడ్డులో ఉంటున్న దంపతులు బాలాజీ, అశ్వినికి 9 ఏళ్లగా పిల్లలు కలగలేదు. దీంతో వారు బుధవారం గొడవపడ్డారు. మనస్థాపం చెందిన అశ్విని పురుగుమందు తాగడంతో గమనించిన భర్త ఆవెంటనే పురుగు మందుతాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. బాధితులను కుటుంబీకులు చికిత్సకోసం వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News September 26, 2025
రాజంపేట MP మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చేనా?

రాజంపేట MP మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈనెల 29న తీర్పు వెల్లడిస్తామని ACB కోర్టు పేర్కొంది. ‘లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి కింగ్ పిన్. ఆయన కంపెనీల్లో రూ.5కోట్ల ట్రాన్సాక్షన్లపై అనుమానం ఉంది. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు’ అని AG దమ్మాలపాటి శ్రీనివాసులు వాదించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా MPపై కేసు పెట్టారని ఆయన తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
News September 26, 2025
ధనలక్ష్మి అవతారంలో బోయకొండ గంగమ్మ

పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం అమ్మవారిని ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం పర్యవేక్షణలో అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం పవిత్ర తీర్థప్రసాదాలను అందజేసి వేద పండితులచే ఆశీర్వచనం కల్పించారు. వివిధ ప్రాంతాల అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
News September 26, 2025
పుంగనూరు: ఆలరించిన డాన్స్ ప్రోగ్రామ్స్

పుంగనూరు మండలంలోని చదల్లలో సప్త మాతృక సమేత చౌడేశ్వరి దేవి ఆలయంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి ఢీ డాన్స్ ప్రోగ్రాం ఆర్టిస్ట్ పండు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఇవి అందరిని అలరించాయి. పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.