News November 11, 2024
మదనపల్లె పూర్వ RDO అక్రమ ఆస్తులు రూ.230 కోట్లు!

మదనపల్లె పూర్వ RDO MS మురళి భారీగా అక్రమ ఆస్తులు సంపాదించినట్లు అధికారులు వెల్లడించారు. ఏసీబీ అధికారులు మురళి కూడబెట్టిన ఆస్తులపై శని, ఆదివారాల్లో సోదాలు నిర్వహించారు. కిలో బంగారు ఆభరణాలు, 800 గ్రా. వెండి, ఏడు ఇళ్లు, ఒక హోటల్, 12 స్థలాలు, 20 బ్యాంకు ఖాతాలు, 8 లాకర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి మార్కెట్ విలువ రూ.230 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఆయనను ఆదివారం నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించారు.
Similar News
News February 10, 2026
చిత్తూరు: కోట్ల రూపాయలు విలువ చేసే భూమిపై కన్ను…!

అనంతపురం- చెన్నై హైవేలోని రొంపిచెర్ల(M) బండకిందలో రూ.3 కోట్లు విలువ చేసే సర్వే నంబర్ 32, 36 లో సుమారు 0.75 సెంట్ల భూమిని ఆక్రమించి చదును చేసుకున్నారు. 2,3 రోజులుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో కబ్జాదారుడు ఒకడుగు ముందుకు వేసి కంచె వేసి మామిడి మొక్కలు నాటేశారు. 20 రోజుల క్రితం బడబళ్లవంక నుంచి ఎర్రబాపన చెరువుకు పోతున్న సప్లై ఛానల్‌ను పూడ్చివేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
News February 10, 2026
చిత్తూరు జిల్లాలో విషాదం

నెల్లిపట్ల గ్రామ పంచాయతీ కేంద్రంలోని ఎస్టీ కాలనీకి చెందిన యానాది గజేంద్ర (31) ప్రమాదవశాత్తు బావిలోకి దిగి మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన మున్నెప్ప వ్యవసాయ బావిలోకి మోటర్ మరమ్మతుకై దిగుతుండగా గజేంద్ర కాలుజారి ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మృతి చెందాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News February 10, 2026
ఎల్లుండి నుంచి మొగిలిలో బ్రహ్మోత్సవాలు

బంగారుపాళ్యం మండలం మొగిలి సమీపంలోని స్వయంభు మొగిలేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 12వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో మునిరాజా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారని చెప్పారు.


