News April 22, 2024
మదనపల్లె: పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరిని చిన్నపాటి రాక్షసి అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ ఎత్తివేస్తామని మాట్లాడారని ఆరోపించారు. అలాగే రాజంపేట ఎన్డీఏ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి వలన రాష్ట్రం రెండుగా విడిపోయిందని, సీఎంగా చేసిన కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందని అన్నారు.
Similar News
News April 23, 2025
రొంపిచర్ల: పదో తరగతి ఒకేసారి పాసైన తండ్రి, కూతురు

రొంపిచర్ల గ్రామపంచాయతీ పాలెం వీధికి చెందిన తండ్రి, కూతురు పదో తరగతి పరీక్షలు రాసి ఒకే సారి పాసైన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 1995-96 సంవత్సరంలో 10 పరీక్షలు రాసిన బి.షబ్బీర్ ఫెయిల్ అయ్యారు. అప్పట్లో ప్రమాదవశాత్తు గాయపడి దివ్యాంగుడిగా మారాడు. ఏదైనా ఉద్యోగం సాధించాలని కుమార్తెతో పాటు పదో తరగతి పరీక్షలు రాశాడు. తండ్రి బి.షబ్బీర్‌కు 319 మార్కులు, కుమార్తె బి.సమీనాకు 309 మార్కులు వచ్చాయి.
News April 23, 2025
టెన్త్ ఫలితాలు: 6 నుంచి 24వ స్థానానికి చిత్తూరు జిల్లా

ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో చిత్తూరు జిల్లాలో ఉత్తీర్ణత శాతం తీవ్ర నిరాశకు గురి చేసింది. గతేడాది టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 91.28% ఉత్తీర్ణతతో 6వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది 67.06 శాతంతో 24వ స్థానంలో నిలిచింది. ఏడాది వ్యవధిలో దాదాపు 18 స్థానాలు దిగజారడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.
News April 23, 2025
టెన్త్ ఫలితాల్లో 24వ స్థానంలో చిత్తూరు జిల్లా

తాజా టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 24వ స్థానంలో నిలించింది. మొత్తం 20,796 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 13,946 మంది పాస్ అయ్యారు. 10,723 మంది అబ్బాయిలకుగాను 6,573 మంది, అమ్మాయిలు 10,073 మందికిగాను 7,373 మంది పాస్ అయ్యారు. కాగా 67.06 శాతం ఉత్తీర్ణత నమోదైంది.