News October 19, 2024

మదనపల్లె: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన యువతి

image

అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన జరిగింది. పెళ్లికాని యువతి శనివారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మదనపల్లె సర్వజన బోధనాస్పత్రిలో వెలుగు చూసిన ఘటనపై వివరాలు.. గుర్రంకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి ప్రియుడి చేతిలో మోసపోయింది. గర్భం దాల్చడంతో ప్రియుడు పెళ్లికి నిరాకరించాడు. చేసేదిలేక ఆ యువతి నెలలు నిండి ప్రసవ నొప్పులతో మదనపల్లె సర్వజన బోధన ఆసుపత్రిలో చేరి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Similar News

News February 20, 2026

ద్రవిడ వర్సిటీకి పెరిగిన గ్రాంట్

image

కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి TTD నుంచి అందుతున్న వార్షిక నిర్వహణ గ్రాంట్‌ను ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు రూ.50 లక్షలు అందుతుండగా, 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి దాన్ని రూ.1 కోటికి పెంచింది. TTD బోర్డు తీర్మానం మేరకు ఈ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో విశ్వవిద్యాలయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల బలోపేతానికి తోడ్పాటు లభించనుంది.

News February 19, 2026

మదనపల్లెలో బాలిక హత్య.. నిందితుడి తల్లిపైనా కేసు

image

మదనపల్లెలో బాలికపై హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వన్ టౌన్‌ పోలీసులు నిందితుడి తల్లిపై కేసు నమోదు చేశారు. A1గా కులవర్ధన్‌ను, A2గా అతడి తల్లి అంజలిని పేర్కొన్నారు. అంజలిపై హత్య, హత్యా నేరం తారుమారు, హత్య జరిగిన సమాచారాన్ని పోలీసులకు చెప్పకపోవడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశామని DSP మహేంద్ర ప్రకటించారు. ఆమె కోసం గాలిస్తున్నామని తెలిపారు.

News February 19, 2026

చిత్తూరు: పేరుకే ఉచిత ఇసుక.. కానీ?

image

ఉచిత ఇసుక పాలసీ అమలులో ఉన్నా జిల్లాలో ఎక్కడా ప్రజలకు ఉచితంగా <<19185159>>ఇసుక<<>> అందడం లేదట. ఇసుకను 5 KM పరిధిలో సరఫరా చేయడానికి కొందరు రూ.2-3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ట్రక్కుల ద్వారా రూ.20 వేలు చెల్లించాల్సిందే. దూరం పెరిగే కొద్దీ ధర మరింత పెరుగుతుంది. తమిళనాడులో నిబంధనల మేరకు అక్కడ ఇసుక అక్రమ రవాణా అసాధ్యం. దీంతో కొందరు ఇక్కడి నుంచే ఇసుకను చెన్నై, వెల్లూరు ప్రాంతాలకు తరలిస్తూ కాసులు దండుకుంటున్నారు.