News April 13, 2024

మదనపల్లె: భార్యపై భర్త బండ రాయితో దాడి..

image

పండుగ సరుకులు కొనివ్వడానికి రాలేదని నిలదీసిన భార్య పై భర్త బండరాయితో దాడి చేసిన ఘటన నిమ్మనపల్లి మండలంలో జరిగింది. పోలీసుల కథనం.. మండలంలోని గారబురుజుకు చెందిన శివకుమార్ మదనపల్లెలో మగ్గాలు నేస్తాడు. శుక్రవారం రాత్రి గారబురుజును శివకుమార్‌ వచ్చాడు. ఉగాది పండుగకు ఇంట్లోకి సరుకులు కొనివ్వడానికి ఎందుకు రాలేదని భార్య దీపిక నిలదిసింది. దీంతో ఆగ్రహించిన భర్త.. భార్యపై బండరాయితో దాడిచేసి గాయపరిచాడు.

Similar News

News October 6, 2025

రేపు అధికారికంగా వాల్మీకి జయంతి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 7న వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం తెలిపారు. రేపు జిల్లా సచివాలయంలోని వివేకానంద భవన్‌లో ఉ.10.30 గం.లకు మహర్షి వాల్మీకి చిత్రపటానికి అంజలి ఘటించడం జరుగుతుందన్నారు. అధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు.

News October 6, 2025

నకిలీ మద్యం ఎక్కడ విక్రయించారు..

image

మొలకలచెరువులో నకిలీ మద్యంను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎంత కాలంగా నకిలీ తయారు చేసి ఎక్కడ ఎక్కడ విక్రయించారనేది విచారణ చేస్తున్నారు. నకిలీ మద్యం అమ్మకాలు చేసిన ఓ డైరీ పోలీసులకు లభించిందని ప్రచారం జరుగుతోంది. త్వరలో దీనిపై మారిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు నుంచి సమాచారం.

News October 6, 2025

జయచంద్ర రెడ్డి చుట్టూ అన్నీ వివాదాలే..?

image

MLA అభ్యర్థిగా జయచంద్రా రెడ్డి ఎన్నికైన నాటి నుంచి అనేక వివాదాలు చుట్టుముట్టాయి. జయచంద్ర రెడ్డి TDP బీ ఫార్మ్ తీసుకోవడంతో శంకర్ యాదవ్ వర్గీయులు తీవ్ర ఆందోళనలు దిగారు. ఎన్నికల టైంలో పోలింగ్ బూతుల్లో ఏజంట్లను నియమించుకోలేక పోయారని వాదన ఉంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబానికి సహకారం అందిస్తున్నట్లు గతంలో తెలుగు తమ్ముళ్లు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.