News August 30, 2025
మదనపల్లె మార్కెట్లో పడిపోయిన టమాటా ధర

మదనపల్లె టమాటా మార్కెట్‌లో ధరలు కిలో రూ.25కు పడిపోయాయి. శనివారం మార్కెట్‌కు 113 మెట్రిక్ టన్నుల టమాటాలు రాగా మొదటి రకం10 కిలోల టమాటా బాక్స్ రూ.250కు అమ్ముడుపోయింది. రెండో రకం రూ.230, మూడో రకం రూ.200 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారని మదనపల్లె టమోటా మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. అయితే వ్యాపారులు సిండికేటుగా మారి రైతుల్ని మోసాలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
Similar News
News August 30, 2025
Fortune పవర్‌ఫుల్ ఉమన్ – 2025 వీళ్లే

ప్రముఖ మ్యాగజైన్ ఫార్చున్ భారత వ్యాపార రంగంలో పవర్‌ఫుల్ ఉమన్ 2025 లిస్ట్ విడుదల చేసింది. ఇందులో FM నిర్మలా సీతారామన్, ముకేశ్ అంబానీ భార్య నీతా టాప్2లో ఉన్నారు. ఇక అపోలో ఫౌండర్ డా. ప్రతాప్ రెడ్డి కూతుళ్లు శోభన, సంగీత, ప్రీతా, సునీత (బిజినెస్ సర్కిల్‌లో రెడ్డి సిస్టర్స్ అంటారు) 3, HCL ఫౌండర్ శివ నాడార్ కూతురు రోష్ని నాడార్ 4, నెట్‌ఫ్లిక్స్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ బేలా బజారియా 5వ స్థానాల్లో నిలిచారు.
News August 30, 2025
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ మహిళలతో కలిసి RTC బస్సులో ప్రయాణించని హోంమంత్రి
➤ బైలపూడిలో భారీ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్
➤ జన్నవరంలో భూవివాదంలో తండ్రి కూతుర్లపై దాడి
➤ వసతి గృహాల విద్యార్థులకు దోమల తెరలు పంపిణీ
➤ దేవరాపల్లి ఎరువుల షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు
➤ కోర్టు కానిస్టేబుళ్లు, CMS సిబ్బందితో SP సమీక్ష
➤ అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు
➤ కలిగొట్లలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ
News August 30, 2025
దుష్ప్రచారం చేయడం తగదు: KMR MLA

వరద సమయంలో అధికారులతో పాటు తాను పని చేసిన పని చేయలేదని దుష్ప్రచారం చేయడం తగదని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం ఆయన కామారెడ్డిలో మాట్లాడారు. ఎవరు ఊహించని విధంగా వర్షం పడటంతో వరదలు వచ్చాయన్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండటంతో ప్రాణ నష్టం జరగలేదన్నారు. పట్టణంలో కలెక్టరేట్ తప్ప అన్ని కాలనీలో భారీగా వరద నీరు వచ్చిందన్నారు. వరదలతో నియోజకవర్గానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు.