News April 25, 2025
మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాధవరెడ్డి అరెస్ట్

సంచలనం రేకెత్తించిన మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో స్థానిక రెడ్డీస్ కాలనీకి చెందిన వైసీపీ నేత, రైస్ మిల్ మాధవరెడ్డిని గురువారం రాత్రి తిరుపతి CID పోలీసులు అరెస్టు చేశారు. CID DSP కొండయ్య నాయుడు కథనం ప్రకారం.. ఈ కేసులో ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతం తేజ్ అరెస్టు కాగా.. గురువారం మాధవరెడ్డిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
Similar News
News April 25, 2025
కుప్పంలో మొదలైన క్యాంపు రాజకీయాలు

కుప్పం మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక ఈనెల 28న జరగనున్న నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్లను ఆ పార్టీ నేతలు క్యాంపులకు తరలిస్తున్నారు. ఈ ఎన్నికను టీడీపీ తరఫున ఎమ్మెల్సీ శ్రీకాంత్ పర్యవేక్షిస్తుండగా.. వైసీపీ తరఫున ఎంపీ మిథున్ రెడ్డి రంగంలోకి దిగారు. ఛైర్మన్ సీటు కోసం ఇరు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.
News April 25, 2025
హిండెన్‌బర్గ్‌తో కలిసి పనిచేసిన రాహుల్ గాంధీ?

అదానీ గ్రూప్‌ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హిండెన్‌బర్గ్ సంస్థతో కలిసి పనిచేశారని స్పుత్నిక్ ఇండియా నివేదిక తెలిపింది. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ కనిపెట్టిందని పేర్కొంది. ‘2023, మేలో హిండెన్‌బర్గ్‌కు సంబంధించిన వారితో కాలిఫోర్నియాలో రాహుల్ భేటీ అయ్యారు. రాహుల్‌కు సన్నిహితుడైన శామ్ పిట్రోడా ఈ-మెయిల్స్‌ను హ్యాక్ చేయడం ద్వారా మొసాద్ ఈ సంగతి గుర్తించింది’ అని తెలిపింది.
News April 25, 2025
ADB: కట్టుకున్నవారే కడతేర్చుతున్నారు

కట్టుకున్నవారే కాలయముళ్లుగా మారి కడతేరుస్తున్నారు. బంధాలను మర్చిపోయి పిల్లలను తల్లి ప్రేమకు దూరం చేస్తున్నారు. ADB (D) గుడిహత్నూర్‌కు చెందిన మారుతి భార్యపై కక్ష పెంచుకుని కత్తితో హతమార్చాడు. ASF(D) కాగజ్‌నగర్‌కు చెందిన జయరాం మగసంతానం కోసం భార్యతో గొడవపడి పలుగుతో దాడి చేసి చంపాడు. అన్యోన్యంగా ఉండాల్సినవారు గొడవలతో జీవితాన్ని నాశనం చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.