News April 4, 2024
మద్దికేర రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు మృతి

మద్దికేర గ్రామ శివారులో ఇటీవల బొలెరో టైరు పగిలి విద్యుత్ స్తంభానికి ఢీకొని బోల్తాపడిన ఘటన తెలిసిందే. అందులో ప్రయాణిస్తున్న మద్దికేర గ్రామానికి చెందిన కూలీలు ఆదిలక్ష్మి (50), సంజమ్మ (40) అదే రోజు మరణించారు. కురువ లక్ష్మీదేవి (35) సావిత్రమ్మ(65) చికిత్స పొందుతూ బుధవార రాత్రి మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Similar News
News February 18, 2026
కర్నూలు: మెడికల్ విద్యార్థిని సూసైడ్

గూడూరు(M) పెంచికలపాడు సమీపంలోని విశ్వభారతి మెడికల్ కాలేజీ విద్యార్థిని సోనిక(22) సూసైడ్ చేసుకుంది. ప్రకాశం(D) తుర్లపాడుకు చెందిన రత్నమయ్య కుమార్తె సోనిక పారామెడికల్ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా ఆమె కొంతకాలంగా మనస్తాపంతో ఉండేది. ఈ క్రమంలో మంగళవారం హాస్టల్ రూములో ఉరేసుకుంది. ఈ ఘటనపై కె.నాగలాపురం ఎస్ఐ అఖిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 18, 2026
కర్నూలు: హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

హోలీ పండుగ సందర్భంగా రైల్వే శాఖ తిరుపతి-రాక్సౌల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈనెల 21, 28న, మార్చి 7న తిరుపతి నుంచి ఉదయం 8.15 గంటలకు రైలు(07051) బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాక్సౌల్ చేరుకుంటుంది. తిరిగి ఈనెల 24న, మార్చి 3, 10న ఉదయం 8.30 గంటలకు రాక్సౌల్ నుంచి బయలుదేరి రెండో రోజు సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైళ్లు గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం మీదుగా నడుస్తాయి.
News February 18, 2026
గుంతల పూడ్చివేత వేగవంతం చేయాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో రహదారుల గుంతల పూడ్చివేత పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ‘పాట్ హోల్ ఫ్రీ రోడ్స్’ లక్ష్యంతో పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. బడ్జెట్ వివరాలు, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు.


