News December 13, 2025
మద్ది ఆలయ కమిటీకి దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో ప్రముఖ క్షేత్రమైన జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయ కమిటీ సభ్యుల నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు ఎక్స్ అఫీషియో కార్యదర్శి హరి జవహర్‌లాల్ ఈ నెల 12న జీవో 1568 జారీ చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు 20 రోజుల్లోగా తమ దరఖాస్తులను ఆలయ సహాయ కమిషనర్, ఈవో ఆర్‌వీ చందనకు అందజేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
FLASH: చౌటుప్పల్‌లో యాక్సిడెంట్

చౌటుప్పల్ పట్టణంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు..పీపల్‌పహాడ్ గ్రామానికి చెందిన వృద్ధ రైతు బొమ్మిడి నర్సిరెడ్డి ఎలక్ట్రిక్ వెహికల్‌పై చౌటుప్పల్ వస్తుండగా బస్టాండ్ వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది.లారీ ఆయనపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు CIమన్మథకుమార్ తెలిపారు.
News December 13, 2025
రెండో దశ ఎన్నికలు జరిగే ప్రాంతాలను పరిశీలించిన KNR సీపీ

కరీంనగర్ జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, అన్ని పోలింగ్ కేంద్రాలను సీసీ టీవీ కెమెరాలు, వీడియో రికార్డింగ్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు ఆయన తెలిపారు.
News December 13, 2025
అలాంటి చర్యలు చేపట్టిన వారిపై చర్యలు: ADB ఎస్పీ

రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్ రూరల్, బోరజ్, జైనథ్ మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాత్రి సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా మద్యం, డబ్బు, బహుమతులు పంపిణీ కాకుండా గస్తీ నిర్వహించాలన్నారు. నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.


