News October 16, 2025

మద్దూరు: చెరువులో వ్యక్తి మృతి.. UPDATE

image

మద్దూరు పట్టణ కేంద్రంలో సంకం చెరువులో ఈ రోజు ఉదయం ఓ వ్యక్తి మృతదేహం పైకి తెలిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా వట్‌పల్లి గ్రామానికి చెందిన శేఖర్(42) మద్దూరులో రవి స్క్రాప్ షాపులో పనిచేస్తున్నాడు. 6 రోజుల శనివారం తెల్లవారుజామున కాలకృత్యాల కోసం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ప్రమాదవశాత్తు ఆయన చెరువులో మృతి చెందినట్లు స్థానికులు భావిస్తున్నారు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Similar News

News October 16, 2025

పెండింగ్ ఓటర్ అప్లికేషన్లను పరిష్కరించండి: వనపర్తి కలెక్టర్

image

ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పెండింగ్‌లో ఉన్న ఫారం 6, 7, 8 అప్లికేషన్లను త్వరతగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. సీఈఓ ఆదేశాల మేరకు 100 ఏళ్లకు పైబడిన ఓటర్లలో ఎవరైనా మరణించిన వారు ఉంటే వారి ఓట్లను తొలగించాలని సూచించారు.

News October 16, 2025

కొత్తచెరువులో చోరీ.. బంగారు దోచుకెళ్లిన దుండగులు

image

కొత్తచెరువులోని పూజారి కాలనీలోని ఓ ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు. రిటైర్డ్ టీచర్ శాంతమ్మ ఇంట్లో చొరబడి 2.5 తులాల బంగారం దోచుకెళ్లినట్లు పేర్కొన్నారు. శాంతమ్మ దంపతులు ఊరికి వెళ్లి ఇవాళ ఇంటికి తిరిగివచ్చి చూడగా దొంగతనం జరిగినట్లు గమనించారన్నారు. శాంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News October 16, 2025

రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

image

AP: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 35-55kms వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.