News February 25, 2025
మద్దూరు: భర్తపై కేసు పెట్టిన భార్య

భార్య కేసు పెట్టడంతో పోలీసులు భర్తను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని హన్మానాయక్ తండాకు చెందిన భాస్కర్ మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. కాగా. జనవరి 28న భార్యను కొట్టడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. భాస్కర్‌ను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి తీర్పునిచ్చారు.
Similar News
News February 25, 2025
MNCL: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నగదు జమ

మంచిర్యాల జిల్లాలోని రైతుల ఖాతాల్లో 19వ విడత పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు నగదు జమ చేసింది. జిల్లాలోని అర్హులైన రైతులకు ప్రతి ఏడాది మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున రూ.6 వేలు జమ చేస్తోంది. ఇప్పటి వరకు 17వ విడతలో 55,658 మంది రైతులకు, 18వ విడతలో 40,534 మంది ఖాతాల్లో నగదు జమ కాగా.. ఈ విడతలో 56 వేల మంది వరకు రైతుల ఖాతాల్లో జమ కానుంది.
News February 25, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే విజయం: బండి

TG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లోనూ బీజేపీనే గెలుస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఆ విషయం తెలిసి CM హడావుడిగా ప్రచారం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోతోందని దుయ్యబట్టారు. కులగణన తప్పుగా సాగిందని, 32శాతమే రిజర్వేషన్లు అమలు చేసే కుట్ర జరుగుతోందన్నారు. ప్రభుత్వ లెక్కల్లో బీసీల సంఖ్య ఎలా తగ్గిందని ప్రశ్నించారు.
News February 25, 2025
పెళ్లై ఏడేళ్లు.. ఒకే కాన్పులో ముగ్గురు జననం

TG: గజ్వేల్ సమీపంలోని అడవిమజీద్‌కు చెందిన మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. నర్సింహులుతో నాగరత్నకు వివాహమవ్వగా ఏడేళ్లుగా పిల్లలు కలగలేదు. ఈ క్రమంలో ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోగా గర్భం దాల్చింది. ఆదివారం ఆమెకు గజ్వేల్ ఆసుపత్రిలో ప్రసవం జరగగా ఇద్దరు మగ, ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.