News February 23, 2025
మద్దూరు: మహిళ అదృశ్యం.. కేసు నమోదు

మద్దూరు మండల పరిధిలో ఓ యువతి కనిపించకుండాపోయిన ఘటన ఈనెల 20న జరిగింది. పోలీసుల వివరాలిలా.. పల్లిగుండ్ల తండాకు చెందిన చిట్టిబాయ్ తన భర్త రవినాయక్‌తో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భర్తతో పాటు బంధువులు అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. చిట్టిబాయ్ తండ్రి లక్ష్మణ్ నాయక్ శనివారం మద్దూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసునమోదైనట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు.
Similar News
News February 23, 2025
గింజేరు జంక్షన్‌లో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

గంట్యాడ మండలం గింజేరు జంక్షన్ వద్ద రెండు బైకులు ఢీకొట్టిన ఘటనలో ఆనంద్(55) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుడు విజయనగరం నుంచి ఎస్.కోట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆనంద్ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం విజయనగరం కేంద్రాసుపత్రికి 108లో తరలించారు.
News February 23, 2025
ప్రజలంతా ఫిట్‌గా ఉండాలి: ప్రధాని మోదీ

దేశ ప్రజలంతా ఫిట్‌గా, ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మన్‌కీ బాత్‌లో ఒబేసిటీ సమస్యను ప్రధాని ప్రస్తావించారు. నగరాల్లో పిల్లలు, పెద్దల్లో ఒబేసిటీ సమస్య పెరుగుతోందని చెప్పారు. దీని వల్ల అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయని, పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా తల్లిదండ్రులు చూడాలని పిలుపునిచ్చారు.
News February 23, 2025
ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండండి: బెల్లంపల్లి ఎమ్మెల్యే

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టభద్రులతో కలిసి సమీక్ష నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో దిశానిర్దేశం చేశారు. పట్టభద్రులంతా నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు.