News April 25, 2025
మద్దూరు: రెవెన్యూ సదస్సులు పరిశీలించిన కలెక్టర్

మద్దూరు మండలం భీమ్ పూర్, నాగంపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సులను గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ పరిశీలించారు. ఇప్పటివరకు రైతుల నుంచి అందిన అర్జీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
Similar News
News April 25, 2025
డెత్ ఓవర్లలో RR బోల్తా.. ఏం జరుగుతోంది?

ఈ సీజన్‌లో RR ఛేజింగ్ డెత్ ఓవర్లలో విఫలమవుతోంది. వరుసగా 3 గెలవాల్సిన మ్యాచ్‌లలో ఓడిపోయింది. APR 16న(vsDC) చివరి ఓవర్లో 9 రన్స్ కావాల్సి ఉండగా టై చేసుకుని సూపర్ ఓవర్‌లో పరాజయం పాలైంది. APR 19న(vsLSG) 6 బంతుల్లో 9 రన్స్ చేయాల్సి ఉండగా 2 రన్స్ తేడాతో ఓడింది. నిన్న RCBతో మ్యాచ్‌లో 12 బంతుల్లో 18 రన్స్ చేయలేక 11 పరుగుల తేడాతో మట్టికరిచింది. దీంతో ఏం జరుగుతోందంటూ RR ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
News April 25, 2025
NRML: వడదెబ్బకు ఏడుగురి మృతి

ఉమ్మడి ADB జిల్లా అగ్నిగుండంలా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని మండలాల్లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో నిర్మల్ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, ఆసిఫాబాద్‌లో ఒకరు, ఆదిలాబాద్‌లో ఒకరు చొప్పున మృతిచెందారు. అనధికారికంగా సంఖ్యల ఎక్కువే ఉండొచ్చు. జాగ్రత్తలు పాటించండి. బయట తిరగొద్దు. నీరు అధికంగా తాగండి.
News April 25, 2025
NRML: ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని యువతి సూసైడ్

ప్రేమించిన యువకుడితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇన్‌ఛార్జ్ ఎస్సై శ్రావణి కథనం ప్రకారం.. ఖానాపూర్ మండలం కొలాంగూడకు చెందిన ఆత్రం స్వప్న(18) గ్రామానికి చెందిన ఒక అబ్బాయిని ప్రేమించింది. యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పత్తి చేనులో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది.