News April 17, 2025
మద్దూర్: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన హైలెట్స్

✓ధరణికి, భూభారతికి పోలికే లేదన్నారు.✓ధరణిని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ లక్షలాది ఎకరాలు కొల్లగొట్టిందని ఆరోపించారు. ✓అధికారులే ప్రజల దగ్గరకు వెళ్లి భూ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. ✓జూన్ 2న నాలుగు పైలెట్ మండలాల్లో భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు.✓భూభారతి చట్టం ద్వారా ప్రతి రైతులకు భద్రత కల్పిస్తాం.✓ధరణి చట్టం ద్వారా రైతులు ఎదుర్కొన్న సమస్యలు భూభారతి చట్టం ద్వారా తీరుతుంది.
Similar News
News April 19, 2025
విచారణకు హాజరైన మిథున్ రెడ్డి

AP: మద్యం కేసులో విచారణకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు ఆయనను విచారిస్తున్నారు. నిన్న విజయసాయి రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది.
News April 19, 2025
జనగామ జిల్లా చరిత్ర, ప్రత్యేకతలు ఇవే!

జనగామ జిల్లాకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది 11వ శతాబ్దంలో కల్యాణి చాళుక్యుల 2వ రాజధానిగా నిలిచింది. 1195-1323 వరకు కాకతీయుల పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. జనగామలో జైన తీర్థంకరుల శిల్పాలు కనుగొనబడ్డాయి. ఇది మేఘాలిథిక్ యుగంలో జైనిజం ప్రాచుర్యాన్ని సూచిస్తుంది. కాగా, జిల్లాలో జీడికల్ రామచంద్ర స్వామి, పాలకుర్తి సోమేశ్వరాలయాలు ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. మీది ఏమండలం? మీ గ్రామ ప్రత్యేకత కామెంట్ చేయండి.
News April 19, 2025
పెద్దపల్లిలో అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

పెద్దపల్లి జిల్లాలో అంతర్రాష్ట్ర ATM దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు డీసీపీ కరుణాకర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దొంగలు రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు సొంత అన్నదమ్ములుగా గుర్తించారు. గత కొద్దిరోజులుగా వస్తున్న ఫిర్యాదులపై పోలీసులు నిఘా పెంచి గాలించారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.