News May 13, 2024
‘మద్నూర్‌లో ఉ.8 గంటల వరకు ఓట్లు నమోదు కాలేదు’
మద్నూర్ మండలంలోని మూడో వార్డులో ఈవీఎంలు మొరాయించాయి. ఉదయం 8 గంటల వరకు ఒక్క ఓటు కూడా నమోదు కాలేదని అధికారుల తెలిపారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు ఇబ్బంది పడ్డారు. దీంతో టెక్నీషియన్ల సాయంతో వాటిని బాగు చేయించి ఓటింగ్ ప్రక్రియ మొదలు పెట్టారు.
Similar News
News January 22, 2025
నిజామాబాద్ జిల్లాలో తొలిరోజు 20,588 దరఖాస్తులు
నిజామాబాద్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన గ్రామసభల్లో 20,588 అప్లికేషన్స్ స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం 4,326, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 2,708, రేషన్ కార్డుల కోసం 13,554 అప్లికేషన్స్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల గ్రామసభ ప్రశాంతంగా జరగ్గా, మరికొన్ని చోట్ల రసాభాసగా మారింది. గాదెపల్లిలో సభ బహిష్కరించారు.
News January 22, 2025
నవీపేటలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం
ఐదేళ్ల బాలికపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఆలస్యంగా వెలుగుచూసింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలికను ఇద్దరు మైనర్లు (12), (13) శనివారం ఆడుకుందామని పిలిచి లైంగిక దాడి చేశారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు వారిని మంగళవారం కోర్టులో హాజరు పరిచారు.
News January 22, 2025
బాల్కొండ: రాష్ట్ర స్థాయి పోటీలకు బాల్కొండ విద్యార్థిని
బాల్కొండ ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నవనీత జిల్లా స్థాయిలో SCERT & ELTA సంయుక్తంగా నిర్వహించిన ఆంగ్ల ఉపన్యాస పోటీల్లో రెసిడెన్షియల్ పాఠశాలల విభాగంలో ప్రథమ బహుమతి పొంది రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ పేర్కొన్నారు. అలాగే తమ పాఠశాల విద్యార్థులు మండల స్థాయి జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినిని పలువురు అభినందించారు.