News December 20, 2024
మద్నూర్: యాసంగి పంటలకు జింకల బెడద

మద్నూర్ మండలంలో యాసంగి పంటలకు జింకల బెడద ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జొన్న, శనగ, మినుము, మొక్కజొన్న సాగు పంట భూములలో పెద్ద సంఖ్యలో జింకలు వచ్చి పంటను నష్ట పరుస్తున్నాయని రైతులు వాపోతున్నారు. గతంలోను జింకల కారణంగా పంటలను నష్టపోయిన సందర్భాలు ఉన్నాయని రైతులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు జింకలు బెడద లేకుండా తగు చర్యలు తీసుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు.
Similar News
News December 31, 2025
NZB: నూతన కలెక్టర్ ఇలా త్రిపాఠి నేపథ్యమీదే!

నిజామాబాద్ నూతన కలెక్టర్‌గా నియమితులైన ఇలా త్రిపాఠి UP లక్నోకు చెందిన వారు. ఢిల్లీలోని జేపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 2013లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత లండన్ వెళ్లారు. అక్కడ లండన్ స్కూల్ ఎకనామిక్స్‌లో చదివారు. రెండో అటెంప్ట్ 2017లో సివిల్స్ సాధించారు. ఆమె భర్త భవేశ్ మిశ్రా కూడా IAS అధికారి. ఆమె ములుగులో పని చేసి టూరిజం డైరెక్టర్‌గా వెళ్లారు. తదుపరి నల్గొండ కలెక్టర్‌గా పని చేశారు.
News December 31, 2025
NZB: మందుబాబులకు పోలీస్ కమిషనర్ హెచ్చరిక

మద్యం తాగి వాహనాలు నడపడాన్ని ఉపేక్షించేది లేదని ఫైన్, జైలు శిక్షకు గురికాక తప్పదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. న్యూయర్ వేడుకల్లో భాగంగా విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మద్యం తాగి రోడ్ల మీద వాహనాలు నడిపిస్తే రూ.10 వేలకు మించిన ఫైన్‌తో పాటు జైలు శిక్ష పడుతుందన్నారు.