News October 19, 2025
మద్నూర్: హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్

హత్యాయత్నం కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బిచ్కుంద CI రవికుమార్ వివరాలు.. మద్నూర్ PS పరిధి సిర్పూర్ శివారులో మహారాష్ట్రకు చెందిన వారు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామస్థులు ఫరూక్ సహా ఐదుగురు వారిని అడ్డుకున్నారు. నిందితులు వారిపై దాడి చేయగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని CI వెల్లడించారు.
Similar News
News October 19, 2025
కడప: తాళ్ల పొద్దుటూరు ఎస్సై సస్పెండ్

కడప జిల్లాలో మరో ఎస్సై సస్పెండ్ అయ్యారు. విచ్చలవిడి అవినీతి, ప్రవర్తన సరిగ్గా లేవనే ఆరోపణలతో పెండ్లిమర్రి ఎస్సై <<18044279>>మధుసూధర్ రెడ్డిని<<>> సస్పెండ్ చేస్తూ డీఐజీ కోయా ప్రవీణ్ ఉత్తర్వులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే రీతిలోనే తాళ్ల ప్రొద్దుటూరు ఎస్సై హృషికేశవరెడ్డిపై కూడా ఆరోపణలు రావడంతో ఆయనని కూడా సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
News October 19, 2025
సైగలతో సుప్రీంలో వాదనలు

న్యాయవాద వృత్తికి మాత్రం వాక్చాతుర్యం చాలా ముఖ్యం. కానీ వినికిడి లోపం ఉన్నప్పటికీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించి ఔరా అనిపించారు సారా సన్నీ. కేరళకు చెందిన సారాకు ముందు లా కాలేజీలో సీటు దొరకడమే కష్టమైంది. పట్టా అందుకున్న తర్వాత కర్ణాటక బార్‌కౌన్సిల్‌లో పేరు నమోదు చేయించుకున్నారు. ప్రస్తుతం జూనియర్ లాయర్‌గా చేస్తున్న సారా కేసు విచారణలో సైన్‌లాంగ్వేజ్‌లో వాదనలు వినిపించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
News October 19, 2025
హార్బర్ సముద్ర బీచ్‌లో పటిష్ఠ బందోబస్తు: ఎస్ఐ

నిజాంపట్నం హార్బర్ సముద్ర తీరంలో యాత్రికుల భద్రతకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ కందుల తిరుపతిరావు తెలిపారు. శనివారం డ్రోన్ కెమెరాల ద్వారా బీచ్ పరిసరాలను పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశాలతో జిల్లాలోని అన్ని బీచ్‌ల వద్ద నిరంతర నిఘా ఉంటుందన్నారు. బీచ్‌లో మద్యం తాగడం, నిషేధిత ప్రాంతాల్లో తిరగడం పూర్తిగా నిషేధమన్నారు. నింబంధలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.