News April 7, 2024
మద్యం అమ్మకాల్లో మంచిర్యాల టాప్..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతేడాదితో పోల్చితే 5 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి. ఆదిలాబాద్‌లో రూ.385.58, ఆసిఫాబాద్‌లో రూ.269.99, మంచిర్యాలలో రూ.703,6, నిర్మల్‌లో రూ.448.83 లక్షల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. మొత్తం గతేడాది రూ.1,716.60కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడు రూ.1,807.66 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంచిర్యాలలో అత్యధిక అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు.
Similar News
News December 25, 2024
తాండూరు మండలంలో పులి సంచారం.. ?
తాండూరు మండలంలోని నీలాయపల్లికి కూత వేటు దూరంలో పులి సంచారం కలకలం రేపుతోంది. మేతకు వెళ్లిన దూడపై పులి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటన విషయం తెలియడంతో గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దూడపై దాడి చేసింది పెద్దపులా.. చిరుత పులా అనేది తెలియాల్సి ఉంది. దూడపై పులి దాడికి సంబంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 24, 2024
MNCL: నేషనల్ బ్యాడ్మింటన్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన శ్రీయన్షి
బెంగళూరులో జరిగిన సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి శ్రీయన్షి రన్నర్‌గా నిలిచినట్లు మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి, టీం మేనేజర్ పుల్లూరి సుధాకర్ తెలిపారు. మంగళవారం ఫైనల్ మ్యాచ్‌లో హర్యానా క్రీడాకారిణి దేవిక సిహాగ్ తో హోరాహోరీగా తలపడి రన్నర్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీయన్షిని ఆయన అభినందించారు.
News December 24, 2024
ఆసిఫాబాద్: తల్లి లేక తల్లడిల్లుతున్న పసికూనలు
పాలు తాగి తల్లి ఒడిలో పడుకోవాల్సిన పిల్లల జీవితం అంధకారంగా మారింది. ASF జిల్లా పెంచికల్‌పేట్‌లో ఓ కుక్క 6 పిల్లలకు జన్మనిచ్చి 4 రోజుల క్రితం చనిపోయింది. దీంతో వాటికి పాలిచ్చేందుకు, చలికి తలదాచుకునేందుకు తల్లి ఒడి దూరమైంది. తల్లి చనిపోయిన విషయం తెలియక ఎముకలు కొరికే చలిలో నాలుగు రోజుల నుంచి ఓ ఆవు పక్కన తలదాచుకుంటున్నాయి. తల్లి కోసం పసిప్రాయాలు అల్లాడుతుంటే స్థానికులు చలించి పాలు అందించారు.