News October 24, 2025

మద్యం టెండర్లు తగ్గుముఖం.. లక్ష్యం చేరని ఎక్సైజ్‌

image

యాదాద్రి జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియలో లక్ష్యం(టార్గెట్) చేరుకోలేకపోయింది. గత ఏడాది 3,969 టెండర్లు రాగా, ఈసారి ప్రభుత్వ ధర రూ.లక్ష పెంచడంతో కేవలం 2,776 టెండర్లు మాత్రమే వచ్చాయి. టార్గెట్‌ రీచ్‌ కోసం ఎక్సైజ్ అధికారులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అయినప్పటికీ, ఆదాయం రూపంలో మాత్రం గతం కంటే రూ.4 కోట్లు అదనంగా సమకూరింది.

Similar News

News October 25, 2025

నిరుద్యోగ బాకీ కార్డును ఆవిష్కరించిన హరీశ్ రావు

image

TG: ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ JAC డిమాండ్ చేసింది. 2 లక్షల ఉద్యోగుల భర్తీ చేయాలంటూ నిరుద్యోగ బాకీ కార్డును బీఆర్ఎస్ నేత హరీశ్ రావు HYDలోని జలవిహార్‌లో ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసగించిందని ఆయన దుయ్యబట్టారు. రేవంత్ అన్ని విధాలుగా విఫలమయ్యారని ఫైరయ్యారు. మరోవైపు నిరుద్యోగులు BRS ట్రాప్‌లో పడొద్దని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు.

News October 25, 2025

NZB: జిల్లాలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

image

నిజామాబాద్-36 మద్యం దుకాణాలకు 963 దరఖాస్తులు, బోధన్-18 మద్యం దుకాణాలకు 455, ఆర్మూర్-25 మద్యం దుకాణాలకు 618, భీమ్‌గల్-12 మద్యం దుకాణాలకు 369, మోర్తాడ్-11 మద్యం దుకాణాలకు 381 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా NZB094-(ఏర్గట్ల) 96, NZB066-(ఆలూరు) 74, NZB097-(వేల్పూర్) 69 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి వివరించారు.

News October 25, 2025

సిరిసిల్ల: పారామెడికల్ డిప్లమో కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

పారా మెడికల్ డిప్లమో కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఆసక్తిగల విద్యార్థులు https://www.tgpmb.telangana.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. బైపిసి విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. అక్టోబర్‌ 28 చివరితేదీ.