News March 9, 2025
మద్యం తాగి వాహనాలు నడపకండి: ఎస్పీ

మద్యం తాగి వాహనాలు నడపడం చాలా ప్రమాదకరమని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. ‘డ్రంక్ అండ్ డ్రైవ్ మీ జీవితానికే కాకుండా ఇతరులకూ ప్రమాదకరం. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో మీ ప్రతిచర్యలు మందగిస్తాయి. అందరూ సేఫ్‌గా గమ్యస్థానాలను చేరుకోవాలి’ అంటూ ఎస్పీ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News November 6, 2025
కుమ్మెరలో అత్యధిక వర్షపాతం నమోదు

NGKL జిల్లాలో గడిచిన 24 గంటలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర 42.5 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. పాలెం 33.8, నాగర్‌కర్నూల్ 26.3, లింగాల 22.5, కల్వకుర్తి 15.5, బిజినేపల్లి 15.0, పెద్దముద్దునూరు 10.5, ఎల్లికల్ 5.3, వటవర్లపల్లి 5.0, వెల్దండ 2.0, ఊర్కొండ 1.3, సిర్సనగండ్ల 0.8, అత్యల్పంగా తోటపల్లిలో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
News November 6, 2025
అల్లూరి జిల్లా టు అమరావతి

అమరావతిలో స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహణకు జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. దీని కోసం పాడేరులో బుధవారం నిర్వహించిన పరీక్షలను ఆయన పరిశీలించారు. రంపచోడవరం నియోజకవర్గం నుంచి ఎస్ సాయిదివ్య, అరకు నుంచి ఎస్. దేదీప్య, పాడేరు నుంచి ఎం. నవ్యశ్రీ ఎంపికయ్యారని తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా ఈ నెల 26న అమరావతిలో జరగనున్న కార్యక్రమంలో వారు పాల్గొననున్నారు.
News November 6, 2025
జమ్మలమడుగు: తండ్రి, కుమార్తెకు జైలుశిక్ష

జమ్మలమడుగులోని నాగులకట్ట వీధికి చెందిన గంజి మాధవి(32) బీసీ కాలనీకి చెందిన మునగాల రవి(35) దగ్గర రూ.5లక్షలు అప్పు తీసుకుంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని రవి ఒత్తిడి చేయడంతో అతడిపై ఆమె కక్ష పెంచుకుంది. 2017 జనవరి 19న నాగులకట్ట వీధిలో తన తండ్రి సూర్యనారాయణ రెడ్డి(65)తో కలిసి రవిని ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసింది. నేరం నిరూపణ కావడంతో మాధవి, సూర్యనారాయణకు కోర్టు తాజాగా జీవిత ఖైదు విధించింది.


