News December 31, 2024

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: DSP

image

శాంతియుత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని నల్గొండ డీఎస్పీ పి.శివరాం రెడ్డి సూచించారు. రాత్రి 10 గంటల తర్వాత రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని, మద్యం సేవించి వాహనాలు నడిపితే సహించేది లేదని హెచ్చరించారు. సైలెన్సర్లు తీసేసి రోడ్లపై న్యూస్ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మిషన్ చెబుత్రపై పోలీసు పోకస్ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు శాంతియుతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని కోరారు.

Similar News

News May 7, 2025

మ్యుటేషన్‌తో వివాదాలకు చెక్: నల్గొండ కలెక్టర్

image

భూభారతి చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి రైతులకు న్యాయం జరిగేలా రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కనగల్ మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూభారతిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. భూములు సర్వే చేసిన తర్వాత మ్యుటేషన్ చేసినట్లయితే ఎలాంటి వివాదాలకు అవకాశం ఉండదన్నారు.

News May 7, 2025

జిల్లాలో ముగిసిన ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

నల్గొండ జిల్లాలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా ఈనెల 20న ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే ఈనెల 24న మిర్యాలగూడలోని ఒక పరీక్ష కేంద్రంలో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పట్టుకొని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే.

News May 7, 2025

NLG: పనితీరు ఆధారంగా అంగన్వాడీలకు ఇక గ్రేడింగ్!

image

 NLGజిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు ఇక నుంచి మొక్కుబడిగా నిర్వహించకుండా ఉన్నతాధికారుల పర్యవేక్షణ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారులు కేంద్రాలకు వచ్చి పోవడంతోనే సరిపెట్టకుండా వారికి ఆటాపాట నేర్పించాలనే దానిపై దృష్టి పెట్టింది. అందుకే కేంద్రాల పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క చెప్పిన విషయం తెలిసిందే. మంచి గ్రేడింగ్ ఉన్న కేంద్రాలకు అవార్డులను సైతం ఇవ్వనున్నారు.