News August 17, 2025

మద్యం తాగి వాహన నడిపి చిక్కుల్లో పడొద్దు: వరంగల్ సీపీ

image

వరంగల్ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వారం రోజుల్లో వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా జరిపిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో మొత్తం 324 కేసులు నమోదయ్యాయి. ఇందులో 16 మంది వాహనదారులకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మిగతా 308 కేసుల్లో రూ.3.95 లక్షల జరిమానాను వాహనదారులు కోర్టులో చెల్లించినట్లు సీపీ తెలిపారు.

Similar News

News August 17, 2025

యూత్ మెచ్చిన సిటీగా బ్యాంకాక్

image

ప్రపంచంలోని 30 ఏళ్లలోపు యువత (Gen Z) మెచ్చిన నగరంగా బ్యాంకాక్ నిలిచింది. ధరలు, కల్చర్, నైట్ లైఫ్, క్వాలిటీ లైఫ్ ఈ నాలుగు లక్షణాలు ఆ సిటీలో ఉండటంతో వారు బ్యాంకాక్ వైపు మొగ్గుచూపుతున్నట్లు టైమ్ అవుట్ సర్వేలో తేలింది. ఇందులో రెండో నగరంగా మెల్‌బోర్న్, మూడో స్థానంలో కేప్ టౌన్ నిలిచాయి. న్యూయార్క్, కోపెన్ హాగన్, బార్సిలోనా, ఎడిన్ బర్గ్, మెక్సికో సిటీ, లండన్, షాంఘై నగరాలు టాప్-10లో నిలిచాయి.

News August 17, 2025

EP38: ఇలా చేస్తే కెరీర్‌లో విజయం తథ్యం: చాణక్య నీతి

image

బలమైన ప్రణాళిక, స్పష్టమైన లక్ష్యం లేకుండా జీవితంలో సక్సెస్ కావడం కష్టమని చాణక్య నీతి చెబుతోంది. ‘కలలు కనడం కాదు, ఆ కలలను వాస్తవంగా మార్చేందుకు కృషి చేయాలి. విజయం సాధించాలంటే సరైన గైడెన్స్, సలహాలు అవసరమే. వైఫల్యాలకు భయపడకూడదు. ఓపిక, నమ్మకం చాలా అవసరం. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. ఎవరూ తమ విజయం కోసం అదృష్టంపై ఆధారపడకూడదు’ అని చాణక్య నీతి బోధిస్తోంది. <<-se>>#Chankyaneeti<<>>

News August 17, 2025

సైనికులను తయారు చేసే గ్రామం ధనసిరి

image

సంగారెడ్డి జిల్లాలోని ధనసిరి గ్రామం దేశానికి సైనికులను అందించడంలో ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటి వరకు ఈ గ్రామం నుంచి సుమారు 50 మందికి పైగా యువకులు భారత సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించారు. ధనసిరిలో దాదాపు ప్రతి ఇంటి నుంచి ఒక యువకుడు సైన్యంలో ఉండడం ఈ గ్రామానికి గర్వకారణంగా మారింది. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ సేవలో ఈ గ్రామానికి చెందిన జవాన్లు నిమగ్నమై ఉన్నారు.