News August 11, 2025

మద్యం దుకాణంలో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలో కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొడ్డు పిచ్చయ్య (54) మద్యం మత్తులో స్థానిక దుకాణం రేకులను తొలగించి మద్యం సీసా తీసుకునే ప్రయత్నం చేస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 17, 2025

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం: డిప్యూటీ సీఎం

image

ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నిలబెట్టుకుంటోందని చెప్పారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి స్పష్టం చేశారు.

News September 17, 2025

ఖమ్మం: పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ యాక్ట్ అమలు

image

ఈ నెల 22 నుంచి 29 వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో జరిగే పదో తరగతి, ఇంటర్మీడియట్ (టీఓఎస్‌ఎస్) పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు అమల్లో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురుకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 17, 2025

ఖమ్మం: రేపటి నుంచి సదరం క్యాంపులు

image

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఈ నెల 18 నుంచి సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేందర్ తెలిపారు. దివ్యాంగులు ఈ క్యాంపుల కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ సదరం క్యాంపులు ఈ నెల 18, 23, 25, 30వ తేదీలలో జరుగుతాయి. అర్హులైన దివ్యాంగులు తమ మెడికల్ రిపోర్టులు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, స్లాట్ బుకింగ్ స్లిప్‌తో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి హాజరు కావాలని ఆయన కోరారు.