News December 15, 2025

మద్యం దుకాణాలను మూసివేయాలి: ఆదర్శ్ సురభి

image

వనపర్తి జిల్లాలో ఈనెల 17న 3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయా మండలాల్లో 5PM తర్వాత ఎటువంటి ప్రచారం నిర్వహించడానికి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.పానగల్, వీపనగండ్ల, శ్రీరంగాపూర్, చిన్నంబావి, పెబ్బేర్ మండలాలలో నిషేధాజ్ఞలు 5గంటల నుంచి అమలులోకి వస్తాయన్నారు. అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

Similar News

News December 17, 2025

లక్ష్యాల సాధనకు పక్కా ప్రణాళికలు రూపొందించాలి: సీఎం

image

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ప్రారంభమైన ఐదో జిల్లా కలెక్టర్ల సదస్సులో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో జిల్లా పురోగతిని సీఎం సమీక్షించారు. GSDP వృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి జిల్లా స్థాయిలో పక్కా ప్రణాళికలతో ముందుకు సాగాలని కలెక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు.

News December 17, 2025

సర్పంచ్ ఎన్నికలు: జగన్‌పై చంద్రబాబు విజయం

image

TG: భద్రాద్రి జిల్లా గుండ్లరేవులో జగన్, చంద్రబాబు అనే వ్యక్తులు సర్పంచ్ బరిలో నిలవడంతో చాలా మందికి ఫలితంపై ఆసక్తి ఏర్పడింది. ఇవాళ్టి మూడో విడతలో బానోతు జగన్‌(Right)పై భూక్యా చంద్రబాబు (Left) విజయం సాధించారు. రాజకీయాల్లోని ప్రముఖ నాయకుల పేర్లతో ఉన్న అభ్యర్థులు ఇక్కడ తలపడటంతో ఈ పోరు మొదటి నుంచీ అత్యంత ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలోని 2 వేర్వేరు వర్గాల మద్దతుతో వీరు బరిలో నిలిచారు.

News December 17, 2025

భారత ఉపరాష్ట్రపతిని కలిసిన MP వేమిరెడ్డి

image

నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం ఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి కార్యాలయానికి బుధవారం MP వెళ్లారు. ఇందులో భాగంగా వేమిరెడ్డి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారు అంశాలపై చర్చించారు.